Anganwadi Schools
-
రిలయన్స్ ఫౌండేషన్ : పిల్లలకోసం మళ్లీ ‘కహానీ కాలా ఖుషీ’
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ తన వార్షిక పథకాన్ని తిరిగి లాంచ్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న బాలలకుసాయం అందించేలా ‘ కహానీ కాలా ఖుషీ’ తిరిగిలాంచ్ చేసింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాలలో భారతదేశం అంతటా కథలు చెప్పడం, ఇతర కార్యకలాపాల ద్వారా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దాదాపు 22వేలమంది పిల్లలకు లబ్ది చేకూరనుంది.ఈ కార్యక్రమంలో రిలయన్స్ వ్యాపారాల్లోని ఉద్యోగి వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, సంఘాలు వెనుకబడిన నేపథ్యాల పిల్లలతో నిమగ్నమై ఉంటారు. గురువారం ముంబైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 400 మంది రిలయన్స్ ఉద్యోగులు స్వచ్ఛందంగా 3,800 మంది పిల్లలను కథలు, కళలు, అవుట్డోర్ , ఇండోర్ గేమ్‌లు నిర్వహించి పిల్లలతో గడిపారు. రాబోయే రోజుల్లో, దేశవ్యాప్తంగా వందలాది మంది వాలంటీర్లు పిల్లలతో పాలుపంచుకుంటారు. మహారాష్ట్ర, తెలంగాణలో, ప్రీ-స్కూల్ పిల్లల కోసం 63 అంగన్వాడీలలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని వెల్లడించిందినవంబర్ 14-16 మధ్య 1,100 కంటే ఎక్కువ అంగన్వాడీలలో 18 వేల మంది పిల్లలను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. కహానీ కలా ఖుషి కార్యక్రమం పిల్లలలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు , విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం 25 నగరాల్లో 17,000 మంది పిల్లలకు చేరువైందని రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
అంగన్వాడీలకు గుడ్ న్యూస్
-
అమ్మమాట.. అంగన్వాడీ బాట..
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’నినాదంతో వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీ ణ అభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్ కేర్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ తరగతులను బోధించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ము ఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా ఆహా్వనించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు పంపి ణీ చేస్తున్న సరుకులు, సేవల నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నా రు. కొన్ని కేంద్రాలకు నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా అయిన నేపథ్యంలో.. వాటి కట్టడి కోసం జిల్లాస్థాయి క్షేత్రస్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నాసిరకం సరుకులు సరఫరా అయితే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలని సూచించారు.సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శించి తనిఖీ చేసి నివేదిక సమరి్పంచాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలోని చిన్నారులకు త్వరలో యూనిఫాంలు అందజేస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధిస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.మహిళలు చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. యునిసెఫ్ సౌజన్యంతో రూపొందించిన న్యూట్రీíÙయన్ చాంపియన్ పుస్తకాన్ని, న్యూట్రీషియన్ కిట్లను మంత్రి సీతక్క ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమీక్షలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లిష్ మీడియం
ములుగు: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తరహా లోనే తెలంగాణలో కూడా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 15 వేల అంగన్వాడీ సెంటర్లను మినీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా అప్డేట్ చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మంత్రి ములుగు జిల్లా బండారుపల్లి మోడల్సూ్కల్ విద్యార్థులకు ప్రభుత్వం తరఫున యూనిఫాం, నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీ బలరాంనాయక్ మోడల్ స్కూళ్లను మంజూరు చేయించారని గుర్తు చేశారు. తర్వాత ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొందరి పనితీరుపై మాట్లాడుతూ, ఇష్టం ఉంటే గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి పనిచేయాలని, లేనిపక్షంలో ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ఇదే క్రమంలో అర్హత పేరుతో ఆశ కార్యకర్తలకు పరీక్ష నిర్వహించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ పక్కన బైఠాయించారు. క్షేత్రస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న తమకు ఫిక్స్డ్ వేతనంగా రూ.18 వేలు అందించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య కొంత మంది ఆశ కార్యకర్తలను మంత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రం అందించారు. కాగా, ఆశ కార్యకర్తల డిమాండ్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, ఆగస్టు వరకు సమస్య పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
AP: ఎస్మా పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు
-
పామిడి మండలాల్లో ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రాలు
-
అంగన్వాడీల్లో సమ్మె సైరన్!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన రిటైర్మెంట్ పాలసీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూనియన్ నేతలు... విధులు బహిష్కరించి ఉద్యమానికి ఉపక్రమిస్తున్నారు. ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె తేదీ కంటే ముందుగానే డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ల చిట్టాను సమర్పించింది. చర్చలకు విరుద్ధంగా రిటైర్మెంట్ పాలసీ... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించి పదవీ విరమణ ప్యాకేజీని ప్రకటించింది. 65 ఏళ్ల వయసును రిటైర్మెంట్ ఏజ్‌గా ఖరారు చేసిన ప్రభుత్వం... పదవీ విరమణ పొందిన టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రిటైర్మెంట్ అయిన వెంటనే టీచర్ లేదా హెల్పర్‌కు ఆసరా పెన్షన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతవారం సంతకం చేయగా... అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్‌కు పూర్తి విరుద్ధంగా ఉందంటూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్లు ధ్వజమెత్తుతున్నాయి. హామీలకు.. అమలుకు పొంతన లేదు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లపై గత నెలలో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నేతలు పలు డిమాండ్లు మంత్రి ముందు ఉంచారు. ఈ క్రమంలో చర్చించి కొన్ని హామీలు ఇవ్వగా... ఇటీవల సీఎం సంతకం చేసిన ఫైలులోని అంశాలపై ఏమాత్రం పొంతన లేదంటూ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. మంత్రితో చర్చలు జరిపినప్పుడు టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు అందులో సగానికి కోత పెట్టారంటూ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ... అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.26వేలుగా నిర్ధారించాలి విరమణ వయసు 60 ఏళ్లకు కుదించాలి విరమణ పొందిన టీచర్‌కు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ నాటికి తీసుకునే వేతనంలో సగం మేర పెన్షన్‌గా ఇవ్వాలి సీనియారిటీ ఆధారంగా వేతనాలను పెంపుతో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఐసీడీఎస్ పథకానికి నిధులు పెంచి మరింత బలోపేతం చేయాలి. కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలి సమాచార నమోదు కోసం కేంద్ర, రాష్ట్రాలు తెచ్చిన యాప్‌ల విషయాన్ని పరిశీలించాలి -
ఏపీ అంగన్ వాడీ కేంద్రాల రూపురేఖలు మారుస్తున్న సర్కార్
-
అంగన్వాడీ బుజ్జాయిలకు ప్రత్యేక కిట్లు
సాక్షి, అమరావతి: అంగన్వాడీల్లోని చిన్నారులు ఆడుతూ పాడుతూ అభ్యాసం చేయడం ద్వారా వారి చదువులకు బలమైన పునాదులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. 3 నుంచి ఆరేళ్లలోపు వయసు గల చిన్నారులకు ప్రీ ప్రైమరీ (పీపీ–1, 2) విద్యాభ్యాసానికి దోహదం చేసే సామగ్రిని అందిస్తోంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 8.50 లక్షల మంది పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (పీఎస్ఈ) కిట్ల పంపిణీ చేపట్టింది. వీటిలో ఒక పలక, 12 రంగుల స్కెచ్ పెన్సిళ్లు, రెండు పెన్సిళ్లు, ఒక రబ్బరు (ఎరేజర్), షార్ప్‌నర్‌తో కూడిన కిట్‌ను ప్రతి విద్యార్థికి అందజేస్తున్నారు. ఈ నెలాఖరులోగా వీటి పంపిణీ పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక్కో స్పెషల్ కిట్ రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ప్రతి కేంద్రానికీ 19 రకాల ఆట వస్తువులతోపాటు మేధస్సుకు పదును పెట్టి విద్యాభ్యాసానికి దోహదం చేసే ప్రత్యేక కిట్లను ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక్కొక్కటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఆ కిట్‌లో చిన్నారులకు ఉపయోగపడే మ్యాట్, సాఫ్ట్ బాల్, చెక్కతో చేసిన సంఖ్యల పజిల్, పెగ్ బోర్డు, అబాకస్, చెక్క బూట్లు, బిల్డింగ్ బ్లాక్‌లు, గమ్ స్టిక్స్, 25 ముక్కల రంగుల పేపర్లు, 5 సెట్ల వాటర్ కలర్స్, 5 సెట్ల స్కెచ్ పెన్నులు, 5 ప్యాకెట్ల పెన్సిల్స్, 5 రబ్బర్లు, 5 షార్పనర్లు, నమూనాల ట్రేసింగ్ బోర్డు, డాఫ్లి, బ్లోయింగ్ సంగీత వాయిద్యాలు, 20 పలకలు, బొమ్మలు తయారు చేసేలా 5 సెట్ల మౌల్డింగ్ క్లే, మూడు ప్యాకెట్ల డస్ట్ ఫ్రీ సుద్దలు, బంతితో బాస్కెట్ బాల్ హోప్, కథల పుస్తకాలు 20 అందించారు. వీటిని ఆయా అంగన్వాడీలకు వచ్చే చిన్నారులు అక్కడే వినియోగించుకుని ఆడుతూ పాడుతూ ఆసక్తిగా అభ్యాసం చేసేలా ఏర్పాట్లు చేశారు. -
సకల సౌకర్యాలతో అంగన్వాడీలు
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాలి. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాల (గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్)ను ప్రతి కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలి. ఫలానా సదుపాయం లేదనిపించుకోకుండా పూర్తి సమాచారం తెప్పించుకోవాలి. చేపట్టాల్సిన పనుల గురించి వివరిస్తూ ఒక నివేదిక రూపొందించి అందజేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి, వాటిని సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనుల పురోగతిపై ఆరా తీశారు. ఫౌండేషన్ స్కూళ్లుగా మారిన సుమారు 10 వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన సుమారు 45 వేల అంగన్వాడీల్లో కూడా వచ్చే మూడేళ్లలో ప్రాధాన్యతాక్రమంలో పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అయితే అప్పటిలోగా వీటిలో ఏవైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలన్నారు. ప్రస్తుతం వాటిలో ఏయే సౌకర్యాలున్నాయి.. ఇంకా ఏయే సదుపాయాలు కావాలనే పూర్తి సమాచారాన్ని గ్రామ సచివాలయాల ద్వారా తెప్పించుకోవాలని చెప్పారు. ప్రధానంగా ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, టాయిలెట్ల వంటి సౌకర్యాల గురించి వాకబు చేయాలన్నారు. పూర్తి సమాచారంతో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలతో తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమర్థవంతంగా నిర్వహణ అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పోషణ పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన నిర్వహణ పద్దతి(ఎస్ఓపీ) రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో ‘సంపూర్ణ పోషణ’ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా ఉండాలని చెప్పారు. ఇందుకోసం అంగన్వాడీలపై పర్యవేక్షణ పెరగాలన్నారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులు మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ చూడాల్సిన సూపర్వైజర్లపై కూడా పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సంచాలకులు ఎం.విజయ సునీత, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీర పాండియన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లోని చిన్నారులకు గుడ్‌న్యూస్.. స్పెషల్ స్నాక్స్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లోని చిన్నారులకు అత్యంత మెరుగైన పౌష్టిక విలువలున్న చిరుతిళ్లు (స్నాక్స్) అందించేందుకు తెలంగాణ ఫుడ్స్ విభాగంరంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు చిరుతిళ్లు అందిస్తున్నప్పటికీ ఇకపై సరికొత్త సాంకేతికతతో ఈ ఆహారాన్ని తయారు చేసి అందించనుంది. దీనికోసం తెలంగాణ ఫుడ్స్ విభాగం ప్రత్యేకంగా అత్యాధునిక స్నాక్‌ఫుడ్ యూనిట్ (ఎక్స్‌ట్రూడర్ యూనిట్)ను స్థాపించింది. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.42.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఈ కేంద్రాన్ని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రారంభించనున్నారు. అమెరికా సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో గంటకు సగటున 4 మెట్రిక్ టన్నుల స్నాక్స్ తయారవుతాయి. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నెలకు సగటున 300 మెట్రిక్ టన్నుల చిరుతిళ్లను సరఫరా చేస్తారు. దీన్ని కేవలం నాలుగైదు రోజుల్లోనే తయారు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర డిమాండ్‌ను తీర్చిన తర్వాత పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రకు సైతం చిరుతిళ్లను ఎగుమతి చేసే దిశగా తెలంగాణ ఫుడ్స్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఫోర్టిఫైడ్ రైస్ కూడా... కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్‌ట్రూడర్ యూనిట్లో స్నాక్స్ మాత్రమే కాకుండా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సైతం తయారు చేయొచ్చు. సాధారణ బియ్యానికి మరిన్ని విటమిన్లు, పోషకాలను కలిపి తయారు చేసేవే ఫోరి్టఫైడ్ బియ్యం. పిల్లలకు సమృద్ధిగా పోషకాలు అందించే క్రమంలో వీటితో కూడిన ఆహారాన్ని అందించే అంశాన్ని పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చే బియ్యానికి బదులుగా ఫోరి్టఫైడ్ బియ్యాన్ని అందిస్తే మరింత పోషక విలువలతో పిల్లలు ఎదుగుతారని భావించిన అధికారులు ఈ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మార్కెట్లో లభించే సాధారణ బియ్యం ధరకు రెట్టింపు ధరలో ఫోరి్టఫైడ్ బియ్యం లభిస్తాయి. దీంతో ఈ ఎక్స్‌ట్రూడర్ యూనిట్ ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. -
అంగన్వాడీలలో నాడు - నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష..
-
అంగన్వాడీల్లో ఇక స్మార్ట్ సేవలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు సెల్ఫోన్లను అందిస్తున్నారు. అయితే త్వరలో అధికారికంగా స్మార్ట్ ఫోన్ల సేవల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకంగా సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. 1.57 లక్షల మందికి పౌష్టికాహారం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా అందులో అంగన్వాడీ కేంద్రాలు, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2212, మినీ అంగన్వాడీ కేంద్రాలు 177 కలిసి మొత్తం 2389 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,57,015 లక్షల మందికి పైగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంతోపాటు కోడిగుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి పేద, మధ్య తరగతి చిన్నారులు, మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రతి బడ్జెట్లో కోట్లాది రూపాయలు కూడా కేటాయిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఫోన్ల పంపిణీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలు అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లకు శ్రీకారం చుడుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు, వారిని పర్యవేక్షించే సూపర్వైజర్లకు కూడా కొత్తగా స్మార్ట్ ఫోన్లను మంజూరు చేశారు. జిల్లాకు 2445 సెల్ఫోన్లు మంజూరయ్యాయి. వీటిని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 2445 స్మార్ట్ఫోన్లు జిల్లాలోని 11 ప్రాజెక్టులలో 2389 మంది కార్యకర్తలకు, 56 మంది సూపర్వైజర్లకు రాష్ట్ర ప్రభుత్వం విధుల నిర్వహణ నిమిత్తం 2445 స్మార్ట్ ఫోన్లను మంజూరు చేసింది. వీటి ద్వారా ఆయా సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ సమాచారాన్ని ఫీడ్ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పక్కాగా పౌష్టికాహారం పంపిణీ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిరోజు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని వైఎస్సార్ సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్‌మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంతోపాటు అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా అవగాహన కల్పించాలి. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా అంగన్వాడీ కేంద్రాలు అందించే ప్రతి కార్యక్రమాన్ని ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు మార్గం సుగమమవుతోంది. అంతేకాకుండా రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. పారదర్శకమైన సేవలు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. ఈ స్మార్ట్ సేవలతో అక్రమాలకు చెక్ పెట్టినట్లవుతుంది. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టికాహారంతోపాటు అనేక సేవా కార్యక్రమాలను పొందుపరచాల్సి ఉంటుంది. -ఎంఎన్ రాణి, ప్రాజెక్టు డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కడప -
Andhra Pradesh: పసందైన భోజనం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారాన్ని పంపిణీ చేయాలని, ఇందులో ఏమాత్రం అలక్ష్యం వహించరాదని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ (నాణ్యమైన) బియ్యాన్ని అందించాలని సూచించారు. మహిళా–శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితరాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలకు పౌష్టికాహారం కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ థర్డ్ పార్టీలతో నాణ్యత తనిఖీ పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా అధికారులు దృష్టి సారించాలి. పౌష్టికాహార పంపిణీలో ఏ చిన్న లోపానికీ తావులేకుండా కట్టుదిట్టమైన విధానాలను అమలు చేయాలి. పూర్తిస్థాయిలో నాణ్యత తనిఖీలు చేసిన తర్వాతే పిల్లలకు అందాలి. ఇందుకోసం థర్డ్ పార్టీలతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. అంగన్వాడీల్లో పిల్లల భాష, ఉచ్ఛారణలపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి. అంగన్వాడీ పిల్లలకు అందించే పాఠ్య పుస్తకాలు అన్నీ బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్(ద్వి భాషా పాఠ్య పుస్తకాలు) ఉండాలి. నిర్వహణ, పరిశుభ్రతకు ప్రత్యేక నిధి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఏర్పాటైన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం తెచ్చిన ఎస్ఎంఎఫ్ తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలి. అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని నెలకొల్పాలి. అంగన్వాడీలు, మరుగుదొడ్ల మరమ్మతుల పనులు చేపట్టాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. ఆ నంబర్‌తో ముద్రించిన పోస్టర్లను ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కచ్చితంగా ప్రదర్శించేలా అంగన్వాడీ వర్కర్లకు బాధ్యత అప్పగించాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎస్డీజీ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలును పటిష్టంగా పర్యవేక్షించాలి. దివ్యాంగులకు సచివాలయాల్లో సేవలు.. రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. దివ్యాంగులకు సేవలందించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ అప్‌గ్రేడ్ దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలో జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాలపై అధ్యయనం చేపట్టి ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా వధూవరులు వివాహ వయసును కచ్చితంగా పాటించేలా నిబంధన విధించినందున బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది. మనో వైకల్య బాధితులకు పెన్షన్లు మానసిక వైకల్య బాధితులకు వైద్యులు జారీ చేసిన తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ఏటా జూలై, డిసెంబర్లో లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా డిసెంబర్లో పెన్షన్లు మంజూరు కానున్నాయి. పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ (గ్రేడ్–2) పోస్టుల భర్తీ నిర్వహిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామన్నారు. అవసరమనుకుంటే ఆన్సర్‌షీట్లను పరిశీలించుకునే అవకాశాన్ని సైతం పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కల్పించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సూపర్ వైజర్ల పర్యవేక్షణతోపాటు అంగన్వాడీలకు అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రత్యేకంగా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా అంగన్వాడీల్లో పాలు, ఆహారం సరఫరా మెరుగైన రీతిలో పర్యవేక్షించనున్నారు. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మార్క్‌ఫెడ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆశల కల..నెరవేరుతున్న వేళ
అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పదోన్నతుల కోసం ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి సువర్ణావకాశం కలి్పంచింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఒంగోలు రీజియన్ పరిధిలో 142 పోస్టులు ఉన్నాయి. సుమారు 5,530 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు ఒంగోలు నగర పరిధిలోని ఏడు ఇంజినీరింగ్ కళాశాలలను ఎంపిక చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఒంగోలు సబర్బన్: అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టు కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాసిన అంగన్వాడీ కార్యకర్తలకు సువర్ణావకాశం కల్పించింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి పూనుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కొన్ని పోస్టులను భర్తీ చేశారు. ఆ తరువాత 2013 డిసెంబర్లో కిరణ్ కుమార్ రెడ్డి రెగ్యులర్ పోస్టులను అసంపూర్తిగా భర్తీ చేశారు. ఆ తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారు. పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేసినా పెడచెవిన పెట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ కావడంతో అంగన్వాడీ కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. ఈ నెల 12వ తేదీతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది. 5,530 దరఖాస్తులు అంగన్వాడీల్లో కార్యకర్తలుగా పనిచేస్తున్న వారి నుంచే సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టులకు ఎంపిక చేస్తారు. పాత ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాల పునర్విభజన తరువాత ఈ మూడు జిల్లాల పరిధి ప్రస్తుతం ఐదు జిల్లాలకు పెరిగింది. ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం పరిధిలో మొత్తం 142 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకుగాను మొత్తం 5,530 మంది అంగన్వాడీ కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 50 మార్కులు.. అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి రాత పరీక్షతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ ప్రొఫిషిఎన్సీ (ఆన్ వీడియో)తో కూడిన పరీక్ష నిర్వహించనున్నారు. 50 మార్కులు. అందులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు 90 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున వేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు ఒక్కోదానికి అర మార్కు చొప్పున 45 మార్కులకు ఇస్తారు. వీటితోపాటు ఐదు మార్కులకు స్పోకెన్ ఇంగ్లిషు ప్రొఫిషిఎన్సీకి కేటాయించారు. అలాగే నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే పావు మార్కు తగ్గిస్తారు. ఏడు కాలేజీల్లో పరీక్ష ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం పరిధిలో సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించేందుకు ఏడు కాలేజీలను ఎంపిక చేశారు. కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందుకు సంబంధించి పోలీస్ అధికారులు, ప్రభుత్వ అనుబంధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష కూడా నిర్వహించారు. ఏర్పాట్లు పూర్తి సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15 నుంచి హాల్ టికెట్లు పంపిణీ చేస్తున్నాం. 18వ తేదీన కేటాయించిన కాలేజీల్లో రాత పరీక్ష ఉంటుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు అభ్యర్థులు పరీక్ష హాలులోకి రావాలి. 10 గంటలకు పరీక్ష ప్రశ్న పత్రం ఇస్తాం. 10 గంటల తరువాత ఎవరినీ హాలులోని అనుమతించం. – వై.శైలజ, ఆర్జేడీ, ఒంగోలు -
మూడు నెలలుగా వేతనాల్లేవ్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీలు మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. పెంచిన జీతం సంగతేమోకానీ, ఉన్న జీతమైనా నెలనెలా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఐదో తేదీలోగా జీతాలు చేతికి అందేవి. దీంతో గత మూడు నెలలుగా ప్రతినెలా ఐదోతేదీ ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచూడటం, ఆ తర్వాత ఉస్సూరమనడం అంగన్వాడీల వంతైంది. పెంచిన జీతాలకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద అపరిష్కృతంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. వరుసగా మూడు నెలలు నిలిచిపోవడంతో గృహావసరాలు తీర్చుకోలేక తాము ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీలు చెబుతున్నారు. కాస్త ఆలస్యమైనా వేతనాలను నెలవారీగా ఇవ్వాలని టీచర్లు, హెల్పర్ల సంఘాలు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3.989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉండగా, మినీకేంద్రాల్లో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఖాళీలు మినహాయిస్తే రాష్ట్రంలో 58 వేలమంది టీచర్లు, హెల్పర్లు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తవేతనాల అమలుతో లింకు... ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలను ప్రభుత్వం పెంచింది. అంగన్వాడీ టీచర్‌కు రూ.10,500 నుంచి రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్‌కు రూ.6,000 నుంచి రూ.7,800కు పెంచగా, వీటిని జూలై నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఆగస్టులో జారీ చేసినప్పటికీ, ఇంకా అమల్లోకి రాలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందలేదని తెలుస్తోంది. కొత్త వేతనాల అమలుకు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, అందువల్లే వేతనాల విడుదలలో జాప్యమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక సమస్యను అధిగమించి బకాయిలతోపాటు ప్రస్తుత వేతనాలను వచ్చే నెలలో ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
అంగన్వాడీల్లో గుడ్డు వెరీబ్యాడ్
సాక్షి, హైదరాబాద్: చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక లోపాలు అధిగమించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహార పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుకు ప్రతినెలా 16 కోడిగుడ్లను అందించాలి. గుడ్లయితే ఇస్తున్నారు కానీ... అందులో నాణ్యత ఉండటం లేదు. ఫలితంగా ఉన్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార లక్ష్యానికి గండిపడుతోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పర్యవేక్షణా లోపంతో గాడితప్పుతోంది. పర్యవేక్షణ లోపం... కాంట్రాక్టర్లకు వరం... రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 21,59,988 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు నమోదయ్యారు. ఇందులో 4,57,643 మంది గర్భిణులు, బాలింతలు కాగా, ఏడు నెలల నుంచి 3సంవత్సరాల లోపు చిన్నారులు 10,34,562 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,67,783 మంది ఉన్నారు. ఒక్కో లబ్ధిదారులకు నెలకు 16 గుడ్లు అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న గుడ్లు 3.45 కోట్లు. ఇందుకోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏటా సగటున రూ.150కోట్ల మేర నిధులను కోడిగుడ్లపైనే ఖర్చు చేస్తోంది. ఇంతటి భారీ బడ్జెట్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై నిఘా లోపించింది. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ... దాదాపు ఏడాదిన్నరగా ఎలాంటి పర్యవేక్షణా లేదు. ఇది కాంట్రాక్టర్లకు వరంగా మారింది. సాధారణంగా ఒక గుడ్డు 50గ్రాములుండాలి. కానీ కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గుడ్లు చాలావరకు నాసిరకంగా ఉంటున్నాయి. తక్కువ ధరకు దొరికే... తక్కువ పరిమాణంలో ఉన్న, మురిగిపోయిన గుడ్లు సరఫరా చేస్తున్నారు. గుడ్లు చిన్నగా ఉంటున్నాయని, ఉడికించిన గుడ్లనుంచి దుర్గంధం వస్తోందని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులు సీడీపీఓలు, జిల్లా సంక్షేమాధికారులు, రాష్ట్ర కార్యాయానికి సైతం వెల్లువెత్తాయి. చివరకు ఈ అంశం మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి వచ్చింది. నివేదిక అందగానే చర్యలు.. కోడిగుడ్ల పంపిణీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫిర్యాదులు, నాణ్యతాలోపాలపై మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఒకట్రెండు రోజుల్లో నివేదిక అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నివేదిక అందిన తర్వాత సమీక్షించి నాసిరకం గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై వేటు వేయాలని, కాంట్రాక్టర్ల ఎంపికలో కఠిన నిబంధనలు విధించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
TS: అంగన్వాడీల్లో ‘ఇంటి భాష’లో బోధన
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషలోనే బోధన చేపట్టాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు మరింత సులభంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలో దీనిని అమలు చేయాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బోధన, అభ్యసనకు సంబంధించిన పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అన్నీ తెలుగులో, ఒకట్రెండు ఇంగ్లిష్‌లో ఉంటున్నాయి. వీటి ద్వారా మైనార్టీలు, గిరిజనులు అధికంగా ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధన చేస్తున్నప్పటికీ వారు ఇంట్లో మాట్లాడే భాషలో చెప్పే అంశాలనే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మైనార్టీలు, గిరిజన తెగలున్న ఆవాసాలు, ఏజెన్సీలు తదితర ప్రాంతాల్లో పిల్లల మాతృ భాషలోనే బోధన సాగిం చాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ దిశలో చర్యలు తీసుకుంటోంది. రెండు రోజుల కిందట జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. భాషల వారీగా కేంద్రాల గుర్తింపు.. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 17.04 లక్షల మంది పిల్లలు నమోదు కాగా, రోజుకు సగటున 6 లక్షల మంది హాజరవుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి వారి మాతృభాషలో బోధన నిర్వహించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లోని అంగన్వాడీల్లో ఉర్దూ, గిరిజన తండాల్లో లంబాడ, ఏజెన్సీ ప్రాంతాల్లో గోండు, కోయ, కొలామ్ భాషల్లో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సీడీపీఓలకు ఒక ప్రణాళికను తయారు చేసి పంపించింది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక భాషల్లో పుస్తకాలను ముద్రించి ఆశ్రమ పాఠశాలల్లో అందుబాటులోకి తెచ్చారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ సహకారాన్ని తీసుకునేందుకు సంబంధిత అధికారులతో శిశు సంక్షేమ శాఖ చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించి పిల్లల మాతృ భాషలో బోధనను ప్రారంభించాలని ఆ శాఖ భావిస్తోంది. -
వాటర్ ట్యాంక్ ఎక్కి విధులు పూర్తి చేస్తున్న టీచర్లు
-
సెల్ ఫోన్ సిగ్నల్ కోసం టీచర్ల తంటాలు
-
ఒక్క ఉపాధ్యాయుడిని కూడా తొలగించం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్కూళ్లు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని.. ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్ కూడా మూతపడ్డం లేదని.. ఒక్క ఉపాధ్యాయుడిని కూడా తీసేయడం లేదని సీఎం తెలిపారు. రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన నాడు–నేడుపై సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని.. ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు. ‘‘పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారు. వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుంది. మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌పరిధిలోకి తీసుకురావాలి. ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలి. ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం. నలుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదని’’ ఆయన పేర్కొన్నారు. పౌండేషన్ కోర్సులో ఇది చాలా అవసరమని.. ఎందుకంటే 8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా అవసరమన్నారు. 8 సంవత్సరాలలోపు పిల్లల్లో నూరుశాతం మెదడు అభివృద్ధి చెందుతుందని.. ఆ వయస్సులో వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలన్నారు. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. 3 కిలోమీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదన్నారు. అలాగే ఒకేచోట ఎక్కువ క్లాస్ రూంలు పెట్టడం సరికాదని సీఎం అన్నారు. చదవండి: ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు రాక బాబు అను‘కుల’ మీడియా చౌకబారు కుతంత్రాలు -
ఒక్క స్కూలు కూడా మూత పడకూడదు
సాక్షి, అమరావతి: కొత్త ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి స్కూలు వినియోగంలో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. స్కూళ్లు, అంగన్ వాడీల్లో నాడు–నేడు, పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి పునాదులు వేయడం, ఎఫెక్టివ్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ మార్గదర్శక ప్రణాళికపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్ వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకం, సీడీలను ఆవిష్కరించారు. అంగన్వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను అధికారులు సీఎంకు చూపించారు. కొన్నిచోట్ల పిల్లల సంఖ్య తక్కువ, టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూళ్లు ఉన్నాయని చెబుతూ కొన్ని కొత్త ప్రతిపాదనలను చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. శిక్షితుడైన టీచర్ పీపీ(ప్రీ ప్రైమరీ)–1, పీపీ–2 పిల్లలకూ అందుబాటులో ఉండడం ఈ ప్రతిపాదనల్లో ఒక సానుకూల అంశమన్నారు. ఈ దశలో పిల్లల మెదడు చురుగ్గా పని చేస్తుందని, అప్పటికే దాదాపు 80 శాతం పైగా అభివృద్ధి చెంది ఉండటం వల్ల వారిలో గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల పీపీ–1, పీపీ–2పై దృష్టి సారించి, మంచి బోధన లభించేలా చూస్తే ఆపై తరగతులతో అనుసంధానం బావుంటుందని వివరించారు. ఈ దిశగా అధికారులు మరోసారి కూర్చొని చర్చించి, మరింత మంచి ఆలోచనలు చేయాలని, ఈ నెలలో మరోసారి దీనిపై సమీక్ష చేద్దామని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. మనిషిని కష్టపెట్టి ఏమీ సాధించలేం ► మనిషిని కష్టపెట్టి, బాధ పెట్టి ఏమీ సాధించలేం. ఆప్యాయతతో మన లక్ష్యాలను టీచర్లకు వివరించడం ద్వారా మంచి పని తీరు సాధించుకోగలం. అసహనాన్ని ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడదు. మనం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకం. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకోవడం ద్వారా మంచి పనితీరు రాబట్టుకోవాలి. ► స్కూళ్ల నిర్వహణ, టీచర్లను వినియోగించడంలో జాతీయ ప్రమాణాలను పాటించాలి. పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి. పిల్లలకు 2 కిలోమీటర్ల దూరం లోపలే బడి ఉండాలి. ఇంతకన్నా ఎక్కువైతే పిల్లలకు భారం అవుతుంది. ► నాడు–నేడు కింద అన్ని రకాల స్కూళ్లు, అంగన్వాడీలను అభివృద్ధి చేస్తున్నాం. ఏ పాఠశాలనూ మూసివేసే పరిస్థితి ఉండకూడదు. అవసరమైన చోట అదనపు తరగతి గదులను నాడు–నేడు కింద నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి ► రూపొందించిన పాఠ్యాంశాలను అంగన్వాడీ టీచర్లు పిల్లలకు బోధించగలగాలి. ఇందుకోసం అంగన్ వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి. పెద్ద వాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లిష్‌లో మంచి విద్యను అందుకోవాలి. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోడంతో పాటు పాఠ్య ప్రణాళిక పటిష్టంగా ఉండేలా చూడాలి. ► నాడు – నేడు కింద బాగు చేసిన భవనాల నిర్వహణపై దృష్టి పెట్టాలి. ఏ సమయానికి ఏం చేయాలన్న దానిపై ఎస్ఓపీ తయారు చేయాలి. రూ.వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి భవనాలను బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్త ప్రతిపాదనలు ఇలా.. ► రాష్ట్రంలో 10 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న స్కూళ్లు, 30 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న స్కూళ్లు ఉన్నాయి. కొన్ని చోట్ల పిల్లల సంఖ్య తక్కువ.. టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూళ్లు కూడా ఉన్నాయి. ► స్కూళ్ల వారీగా అక్కడున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్యను బట్టి మార్పులు చేయాలి. ► పిల్లలు తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలను కలుపుకునే విషయం పరిశీలించాలి. అప్పుడు అంగన్వాడీ టీచర్లు, ప్రస్తుతం ఉన్న టీచర్లు వీరికి విద్యాబోధన చేస్తారు. ► తద్వారా శిక్షితులైన ఉపాధ్యాయులు వారికి ప్రాథమిక దశ నుంచే మంచి బోధన ఇవ్వగలరు. అలాగే స్కూళ్లు కూడా సమర్థవంతంగా వినియోగమవుతాయి. అవకాశం ఉన్న చోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా హైస్కూల్ పరిధికి తీసుకురావాలి. ► అవసరమైన చోట అప్పర్ ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లుగా మార్చాలి. ► స్కూళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, టీచర్ల సేవలను అదే రీతిలో వాడుకోవడానికి జాతీయ మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించాలి. విద్యాభ్యాసంలో గట్టి పునాదుల కోసం ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయి. -
అంగన్వాడీల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంగన్వాడీల్లో కూడా ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పాఠశాల విద్యాశాఖపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంగ్లీషులోనే బోధించాలని, వారితో ఇంగ్లీషు మాట్లాడించటం అలవాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలతో సహా పీపీ-1లలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. నాడు-నేడు కింద తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్ 30న ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు. అలాగే, జగనన్న గోరుముద్దపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. పిల్లలకు నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్ మాట్లాడుతూ.. మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యేనాటికి పిల్లలందరికీ విద్యాకానుక అందాలని ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈపై టీచర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలని.. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.