విద్యార్థులకు రిలయన్స్ ఉపకార వేతనాలు | Reliance Foundation awards scholarship to 393 students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు రిలయన్స్ ఉపకార వేతనాలు

Jan 23 2014 12:23 AM | Updated on Sep 2 2017 2:53 AM

అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న 393 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ ఉపకార వేతనాలను అందించింది.

ముంబై: అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న 393 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ ఉపకార వేతనాలను అందించింది. వీరిలో 111 మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో విద్యార్థులందరికీ ఉపకార వేతనాలను అందించారు.

 ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనందించే సంకల్పంతో 1996 నుంచి ప్రారంభించిన ధీరూ అంబానీ ఉపకార వేతనం కార్యక్రమం కింద ఇప్పటివరకు పది వేల మంది అభ్యర్థులు లబ్ధి పొందారు. వీరిలో రెండు వేల మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారని ఫౌండేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement