విద్యార్థులకు రిలయన్స్ ఉపకార వేతనాలు
ముంబై: అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న 393 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ ఉపకార వేతనాలను అందించింది. వీరిలో 111 మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో విద్యార్థులందరికీ ఉపకార వేతనాలను అందించారు.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనందించే సంకల్పంతో 1996 నుంచి ప్రారంభించిన ధీరూ అంబానీ ఉపకార వేతనం కార్యక్రమం కింద ఇప్పటివరకు పది వేల మంది అభ్యర్థులు లబ్ధి పొందారు. వీరిలో రెండు వేల మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారని ఫౌండేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు.