ముంబై : టీచింగ్ ప్రొఫెషనల్ ఒలింపియాడ్‌లో ప్రతిభ కనబరిచిన 1000 మంది ఉపాధ్యాయులను రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డులతో గౌరవించింది. అవార్డు విజేతలను యునెస్కో, యునిసెఫ్, సీబీఎస్‌ఈ బోర్డు ప్రతినిధులు సహా పలువురు ప్రముఖుల సమక్షంలో సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారిని ప్రోత్సహించేందుకు బోధనలో మెళుకువలు పెంచుకునేందకు రిలయన్స్ ఫౌండేషన్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌పై వారికి శిక్షణ ఇస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో ఇషా అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ టీచర్ అవార్డుల ద్వారా ఈ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టీచర్లను గుర్తించి సత్కరించడం తమకు గర్వకారణమని చెప్పారు. దేశ భవిష్యత్‌ను నిర్ధేశించే యువతరాన్ని రూపొందించడంలో ఉపాధ్యాకులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. దేశవ్యాప్తంగా మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ కట్టుబడి ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment