రిలయన్స్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి 5,000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. దీని కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు 2023 అక్టోబర్ 15లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్ అన్ని బ్రాంచ్‌లలోని మొదటి సంవత్సరం రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్‌షిప్ మెరిట్ ఆధారంగా చేసుకుని అందివ్వడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన ఒక్కో విద్యార్థికి రూ. 2 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇందులో మహిళా విద్యార్థులకు, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా చదువుకోవాలనే సదుద్దేశ్యంతో రిలయన్స్ సంస్థ ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. 2022 - 23 విద్యాసంవత్సరంలో కూడా సంస్థ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దీని కోసం అప్పుడు లక్ష మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంపికైన వారిలో 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం!
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి www.scholarships.reliancefoundation.org వెబ్‌సైట్ సందర్శించవచ్చు. ఇందులో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment