
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఫైల్ ఫోటో)
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం లాభదాయకమైన కంపెనీగా మార్కెట్‌లో దూసుకుపోతుండటమే కాకుండా.. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తన వంతు కృషి అందిస్తోంది. ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్(ఆర్‌ఎఫ్), సీఎస్‌ఆర్ సంస్థ ద్వారా సమాజానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. విజయంతంగా ఈ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను అందిస్తుండటంతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2017 సంవత్సరానికి గాను గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మాజీ జడ్జీ అరిజిత్ పాస్యత్ ఆధ్వర్యంలోని అవార్డుల జ్యూరీ గోల్డెన్ పీకాక్ అవార్డు 2017కి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఎంపికచేసింది.
వ్యవస్థాపకురాలు, చైర్మన్ నీతా అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 13,500 గ్రామాలు, 74 అర్బన్ ప్రాంతాల్లో 15 మిలియన్ మంది ప్రజలకు తన సేవా కార్యక్రమాలను అందిస్తోంది. రిలయన్స్ పౌండేషన్ విద్య, క్రీడలు, ఆరోగ్యం, గ్రామీణ పరివర్తన, పట్టణ పునరుద్దరణ, విపత్తు ప్రతిస్పందన, మహిళల సాధికారత, ప్రమోషన్ , భారతీయ సంస్కృతి పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. రిలయన్స్ తన కార్పొరేట్ సామాజిక కార్యక్రమాల కోసం మూడు మోడ్స్‌ను ఎన్నుకుంది. డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్(నిపుణుల టీమ్ ద్వారా కార్యక్రమాలు అందించడం), పార్టనర్‌షిప్స్(భాగస్వామ్య సంస్థల ద్వారా అందించడం), లెవరేజింగ్ టెక్నాలజీ ద్వారా రిలయన్స్ తన సేవలను అందిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 40 ఏళ్ల ప్రస్తానంలో పలు మైలురాయిలను చేధించింది. రెండు దశాబ్దాలకు పైగా కంపెనీ తన దాతృత్వ కార్యక్రమాలతో సామాజిక విలువలను అందిస్తోంది.
గోల్డెన్ పీకాక్ అవార్డులను నెలకొల్పి 25 ఏళ్లకు పైగా అయింది. స్థానికంగా, అంతర్జాతీయంగా అందించే ఉత్తమమైన సేవా కార్యక్రమాలకు గాను దీన్ని అందిస్తారు. మూడు స్థాయిల్లో ఇండిపెండెంట్ అసెసర్స్ అవార్డు దరఖాస్తుదారులను పరిశీలించిన అనంతరం, చివరికి గ్రాండ్ జ్యూరీ ఈ అవార్డు గ్రహీతలను ఎంపికచేస్తోంది. ఈ క్రమంలోనే 2017 గోల్డెన్ పీకాక్ అవార్డులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంపికైంది.
Comments
Please login to add a commentAdd a comment