
ముంబై: ప్రముఖ పారిశ్రామిఖవేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అబానీ కుటుంబానికి చంపేస్తామంటూ ఓ గర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఒక దుండగుడు రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి కాల్‌చేసి ఆస్పత్రిని బాంబుతో పేల్చేస్తానని, అలాగే రిలయన్స్ కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఈ మేరకు పోలీసులు రిలయన్స్ ఆస్పత్రికి బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రిని పేల్చేస్తానని బెదిరించడమే కాకుండా అంబాని కుటుంసభ్యులను కూడా చంపేస్తానని బెదరించాడని అన్నారు.
ఐతే ఇలాంటి బెదిరింపు కాల్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కి ఆగస్టు15న హెల్ప్‌లైన్ నెంబర్‌కు వచ్చాయి. ఆ ఘటనలో దుండగడు ఎనిమిది కాల్స్ చేశాడని అన్నారు. ఐతే కాల్ చేసిన వ్యక్తిని దహిసర్‌గా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు కూడా
Comments
Please login to add a commentAdd a comment