caller
-
ముఖేశ్ అంబానీ కుటుంబానికి ప్రాణ హాని...చంపేస్తామంటూ బెదిరింపు కాల్
ముంబై: ప్రముఖ పారిశ్రామిఖవేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అబానీ కుటుంబానికి చంపేస్తామంటూ ఓ గర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఒక దుండగుడు రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి కాల్చేసి ఆస్పత్రిని బాంబుతో పేల్చేస్తానని, అలాగే రిలయన్స్ కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు రిలయన్స్ ఆస్పత్రికి బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రిని పేల్చేస్తానని బెదిరించడమే కాకుండా అంబాని కుటుంసభ్యులను కూడా చంపేస్తానని బెదరించాడని అన్నారు. ఐతే ఇలాంటి బెదిరింపు కాల్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కి ఆగస్టు15న హెల్ప్‌లైన్ నెంబర్‌కు వచ్చాయి. ఆ ఘటనలో దుండగడు ఎనిమిది కాల్స్ చేశాడని అన్నారు. ఐతే కాల్ చేసిన వ్యక్తిని దహిసర్‌గా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు కూడా (చదవండి: చీతా హెలికాప్టర్ క్రాష్ ...పైలెట్ మృతి) -
కాలర్.. కట్‌చేస్తే ఆభరణం...
పార్టీకి వెళ్లాలంటే డిజైనర్ దుస్తులున్నా సరైనా ఆభరణాలు లేకపోతే మేకప్ సంతృప్తినివ్వదు. వేడుక అంతా తమదే అన్నట్టు తిరగాలంటే మెడనిండుగా నప్పే ఆభరణాలతో కళ కళలాడుతూ ఉంటేనే సాధ్యం. అవి బంగారు, వజ్రాభరణాలే కానక్కర్లేదు. కేవలం ఒక షర్ట్... దానికో కాలర్ ఉంటే చాలు. కట్ చేయచ్చు. ఇలా కంఠాభరణంగా రూపుకట్టేయచ్చు. పాత చొక్కాలు, ఫ్రాక్‌లు బ్యాగు అడుగనో.. పాత బట్టల మూటలోనో చేరుతూనే ఉంటాయి. వాటి కాలర్స్ చూస్తే ఏదైనా ఆలోచన వస్తుందా?! ట్రై చేయండి. ముందుగా నచ్చిన షర్ట్, ఫ్రాక్ (కాలర్ ఉన్నది) తీసుకొని కాలర్ భాగాన్ని కట్ చేయాలి. కాలర్ ప్లెయిన్దైతే మీ టాప్‌కి పూర్తి కాంట్రాస్ట్ ఉండే ప్రింట్లు లేదంటే ఎంబ్రాయిడరీ చేసి హారంలా ధరించవచ్చు. ఇది ఫ్యాషన్ జువెల్రీగా కూడా బాగుంటుంది. కాలర్కి ముత్యాలు ఇతర పూసలు, స్టోన్స్, ఎంబ్రాయిడరీ లేసులు కూడా అతికించి అందమైన కంఠాభరణాన్ని రూపొందించుకోవచ్చు. పెద్ద పెద్ద పూసలు, రిబ్బన్ మెటీరియల్‌ను ఉపయోగించి పిల్లల దుస్తుల మీదకు ఫ్యాన్నీ జ్యువెల్రీగా వాడచ్చు. హెయిర్ క్లిప్గానూ తయారుచేయవచ్చు. కాలర్కి రెండు వైపులా ఆభరణాలను అతికించి, మరో అందమైన ఆభరణాన్ని తయారుచేసుకోవచ్చు. ఈ తరహా కాలర్ డిజైన్స్ మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. -
బాలీవుడ్ హీరోను ఖతం చేస్తాం..
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ వరుస బెదిరింపులు రావడం కలకలం రేపింది. సాక్షాత్తు పోలీస్ కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించడం బీటౌన్‌లో ప్రకంపనలు రేపింది. ముంబై పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించారు. సల్మాన్ ఖాన్‌ను ఖతం చేస్తామంటూ తమ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో వరుసగా రెండురోజులు ముంబైలోని సిటీ పోలీస్ కంట్రోల్ రూంకు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దక్షిణ ముంబై శివారు మలద్ లోని పబ్లిక్ బూత్ నుంచి ఈ కాల్ వచ్చినట్టు పోలీసులు తేల్చారు. మరిన్ని వివరాల కోసం సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఆగంతకుల ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందన్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇది ఫేక్ కాల్ కావచ్చని వారు అనుమానిస్తున్నామన్నారు.