బాలీవుడ్ హీరోను ఖతం చేస్తాం.. | Anonymous caller 'threatens to kill' Salman Khan | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరోను ఖతం చేస్తాం..

Published Tue, Feb 23 2016 2:00 PM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM

బాలీవుడ్ హీరోను ఖతం చేస్తాం.. - Sakshi

బాలీవుడ్ హీరోను ఖతం చేస్తాం..

ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ వరుస బెదిరింపులు రావడం  కలకలం రేపింది. సాక్షాత్తు పోలీస్ కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించడం బీటౌన్‌లో ప్రకంపనలు రేపింది. ముంబై పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించారు. సల్మాన్ ఖాన్‌ను ఖతం చేస్తామంటూ  తమ కార్యాలయానికి  గుర్తుతెలియని వ్యక్తులు  ఫోన్ చేసినట్టు తెలిపారు.  

ఫిబ్రవరి 16, 17 తేదీల్లో వరుసగా  రెండురోజులు  ముంబైలోని సిటీ పోలీస్ కంట్రోల్ రూంకు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు  పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.  దక్షిణ ముంబై  శివారు మలద్ లోని పబ్లిక్ బూత్ నుంచి ఈ కాల్ వచ్చినట్టు పోలీసులు తేల్చారు.  మరిన్ని వివరాల కోసం   సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఆగంతకుల ఆచూకీ కనుక్కునేందుకు  ప్రయత్నిస్తున్నామన్నారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందన్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇది ఫేక్ కాల్ కావచ్చని వారు అనుమానిస్తున్నామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement