కత్తి పట్టిన క్రికెటర్ | Ravindra Jadeja seen brandishing sword during his Sangeet ceremony in Rajkot Gujarat | Sakshi
Sakshi News home page

కత్తి పట్టిన క్రికెటర్

Published Sun, Apr 17 2016 11:25 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

కత్తి పట్టిన క్రికెటర్

కత్తి పట్టిన క్రికెటర్

రాజ్‌కోట్: గ్రౌండ్‌లోనే కాదు వెలుపల కూడా తాను అదుర్స్ అని టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా నిరూపించుకున్నాడు. ఫంక్షన్‌లో స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇంతకీ ఫంక్షన్ ఎవరిది అంటారా? జడేజాదే. అసలు విషయం ఏంటంటే రీవా సోలంకితో ఇవాళ జడేజా వివాహం జరగనుంది. అందులో భాగంగా శనివారం రాత్రి సంగీత్ వేడుక నిర్వహించారు. జడేజా తనకు కాబోయే భార్యతో కలిసి చిందులేశాడు. అంతేకాదు కత్తితో విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఒంటి చేత్తో కత్తిని తిప్పుతూవుంటే అక్కడున్నవారు అతడిపై డబ్బులు విసిరి అభిమానం చాటుకున్నారు. బ్యాట్ తోనే కాదు కత్తితోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు.

ఫిబ్రవరి 5న రీవా సోలంకితో జడేజా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇవాళ వారిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ ఆడుతున్న జడేజా శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో లేడు. 21న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ కొత్త పెళ్లికొడుకు ఆడకపోవచ్చని సమాచారం. ఆదివారం సాయంత్రం జరిగే రిసెప్షన్‌కు లయన్స్ జట్టు ఆటగాళ్లు హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement