దీపికా పదుకొణె సాంగ్‌.. హీరోయిన్‌ కంటే బాగా చేసింది! | Woman recreates Deepika Padukone Nagada Song dance steps | Sakshi
Sakshi News home page

Deepika Padukone Nagada Song: దీపికా పదుకొణె డ్యాన్స్‌తో మరిపించిన మహిళ.. వీడియో వైరల్!

Oct 1 2023 12:14 PM | Updated on Oct 1 2023 12:35 PM

Woman recreates Deepika Padukone Nagada Song dance steps - Sakshi

డ్యాన్స్ అనేది ఓ అందమైన కల. సినీ తారలకైతే వారి డ్యాన్స్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. కేవలం వారి డ్యాన్స్ చూసి పిచ్చా ఫ్యాన్‌గా మారిపోతుంటారు. అంతే కాకుండా వారిలా డ్యాన్స్ చేస్తూ తన అభిమాన తారలను మరిపిస్తుంటారు. బాలీవుడ్‌ భామ దీపికా పదుకొణె డ్యాన్స్‌ చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి నటించిన  గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రంలో నగదా అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఏ ఈవెంట్‌ జరిగినా ఈ సాంగ్ కచ్చితంగా ఉంటుంది. అయితే నవరాత్రుల సందర్భంగా చాలా చోట్ల ఈ పాటను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

(ఇది చదవండి: చాలా ఎమోషనల్‌గా సాగిన సిద్ధార్థ్‌ 'చిన్నా' ట్రైలర్‌)

తాజాగా ఈ పాటకు ఓ మహిళ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.  అచ్చం దీపికా పదుకొణెను మరిపించేలా డ్యాన్స్ చేసింది.   గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలాలోని నగదా సాంగ్‌కు తన స్టెప్పులతో మరిపించింది.  ఆమె బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుండగా.. ఏమాత్రం తేడా లేకుండా  ఆ మహిళ పాటలోని స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఏకంగా ఏడు మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.

నెటిజన్ల ప్రశంసలు

ఆమె డ్యాన్స్‌ను చూసిన నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. వావ్... ఇది ఓ అద్భుతమైన నృత్యం.. నాకు బాగా నచ్చింది అంటూ కామెంట్ చేశారు. ఈ పాటకు ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది అంటూ పోస్టులు పెడుతున్నారు. అచ్చం దీపికా పదుకొణెను మరిపించిందంటూ మరికొందరు కామెంట్స్  చేస్తున్నారు. కాగా.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రం 2013లో విడుదలైంది. ఈ చిత్రంలో సుప్రియా పాఠక్, శరద్ కేల్కర్, రిచా చద్దా నటించారు. ఈ చిత్రం ద్వారానే రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల మొదటిసారి కలిసి నటించారు. 

(ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్‌’ వచ్చేస్తుంది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement