ఇతిహాసమైన రామాయణం అందం, భక్తి, సంక్లిష్టతలను ఐశ్వర్య హరీష్ ప్రదర్శించే భరతనాట్యం అన్వేషిస్తుంది. శాస్త్రీయ నృత్యాన్ని బహుభాషా కథనాలతో మిళితం చేసి మన ముందు ప్రదర్శిస్తుంది. రామాయణంలో తెలియని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ‘అభిరామం’ ప్రదర్శనను ఎంచుకున్నాను అని చెబుతుంది. ఐశ్వర్య హరీష్ పుట్టుకతోనే నృత్యకారిణి అని చెప్పవచ్చు. ఐదు తరాలుగా ఆ ఇంట నృత్యకళాకారులే ఉన్నారు. ఆ విధంగా చాలా చిన్న వయస్సు నుండి తన తల్లి ద్వారా శిక్షణ పొందుతూ ఐశ్వర్య తన స్వంత నృత్య కథల గురించి కలలు కంటూ పెరిగింది. ఇటీవల ముంబయ్‌లో ప్రఖ్యాత నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఎ)లో ప్రదర్శన ద్వారా అబ్బురపరిచిన ఐశ్వర్య రామాయణాన్ని నృత్యంగా ఎందుకు ఎంచుకున్నానో వివరించింది.
నృత్యంతో అన్వేషణ
‘‘రాముడు నా ఇష్ట దేవత. నా చిన్నప్పుడు రాముని గంభీరమైన రూపం, అతనిపై పాట, పద్యం, నృత్యం ఏది నేర్చుకున్నా అది నన్ను ఉత్తేజపరిచింది. ఇటీవల, వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనగా వాల్మీకి రామాయణాన్ని దాని అనువాదంతో పాటు చదవడం ప్రారంభించాను. చదివేటప్పుడు కథలో ఇంకా ఏవో తెలియని అంశాల సారంశాం ఉందని గ్రహించాను. చాలా అన్వేషించని కోణాలు ఉన్నాయి.
ప్రతి క్యారెక్టర్‌లోనూ రసాలు ఎక్కువ. ఇది నాకు నృత్యంలో అన్వేషించాలనే ఆలోచనను ఇచ్చింది. రామాయణానికి చాలా వెర్షన్లు ఉన్నాయి. అందుకే నా పరిశోధన విస్తృతం చేశాను. దీంతో అనేక అవకాశాలు నాకు లభించాయి. అన్ని వెర్షన్లు కథాంశం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి విభిన్న దృష్టి, రుచిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు– వాల్మీకి రామాయణం రాముడిని మానవ శ్రేష్ఠతగా చూస్తే, అధ్యాత్మ రామాయణం అతనిని అంతిమ భగవంతునిగా, అద్భుతంగా చూసింది. రామాయణంలో సీత పాత్రకు భిన్నమైన టేకింగ్ ఉంది.
ఆత్మను కదిలించాలి
అభిరామం నృత్య రూపకం వివిధ రామాయణ గ్రంథాల నుండి సేకరించిన ఆరు అరుదైన ఎపిసోడ్‌లను వర్ణిస్తుంది. రామాయణం భారతీయ మనస్తత్వంలో చాలా పాతుకుపోయింది కాబట్టి, నేను కథ టైమ్‌లైన్‌ను నిర్వహించాలనుకున్నాను. రాముడి కథ ప్రతి మట్టిని దాని స్వంత ఫ్లేవర్‌లో తాకింది. నేను దానిని ఉపదేశాత్మకంగానో, సాదాసీదాగానో స్తుతించేలనుకోలేదు. శృంగార భక్తి కోణాన్ని కొనసాగించాను. అదే నన్ను మొదటి స్థానంలో ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చింది. ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, దానిని మరో కోణంలో వివరిస్తే అది వినోదభరితంగా ఉండాలి అలాగే ఆత్మను కదిలించాలి. ప్రేక్షకుల ఊహల మైదానంలో ఆ అంశం తిరగాలి. నేను ఎంచుకున్న కథ మాత్రమే కాదు నా డ్యాన్స్ ఎలిమెంట్‌ను కూడా కోల్పోకూడదు. దీన్ని మరింత థియేట్రికల్ ప్రెజెంటేషన్‌గా మార్చాలనుకున్నాను.
ఆకర్షించిన అంశాలు
మొదట వాల్మీకి రామాయణాన్నే చదివాను. మా అమ్మ అప్పటికే తులసీదాస్ రచనలపై కొంత పరిశోధన చేసింది. అలా తులసి రామాయణం నుండి నాకు నచ్చిన అంశాలను సేకరించడానికి అది ఒక కిటికీలా ఉపయోగపడింది. కౌసల్య తన నవజాత శిశువుతో చేసిన మొదటి సంభాషణ నన్ను అమితంగా ఆకర్షించింది. అదేవిధంగా, రావణుడి పాత్రను చూస్తే విష్ణువు దైవిక బలాన్ని ఎదుర్కోవడంలో పూర్తి జ్ఞానంతో అతను సీతను అపహరించాడు. రావణుడు మోక్షానికి తన ఏకైక సాధనం – భగవంతుడి చేతిలో మరణం ఇదేనని గ్రహించాడు. తులసీరామాయణం రాముడు, సీత స్వయంవరం, వారి కలయిక గురించి చాలా అందంగా, సుందరంగా కవితాత్మకంగా అన్వేషించబడింది. రావణుడి సోదరి శూర్పణఖ సీతను అపహరించడానికి, ఆమె చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరుడిని ప్రేరేపించడం ద్వారా రామాయణంలో మలుపు తిరిగింది. అరుణాచల కవి తమిళంలో రామనాటకంలో ఈ క్యారెక్టరైజేషన్‌ని చాలా అందంగా చూపించాడు, రాక్షసి బెంగను అనుభూతి చెందాడు. ప్రొడక్షన్‌లో ఇది మూడో ఎపిసోడ్‌గా తీసుకోబడింది. కథను ఇలా ముందుకు తీసుకెళ్తుంటే హనుమంతుని అద్భుతమైన చర్యలు, సెయింట్ పురందర దాసు కన్నడ పద్యాల పదునుగా బయటకు వచ్చాయి.
తల్లే గురువు
మా అమ్మ నా గురువుగా ఉండటం నాకు దొరికిన అద్భుతమైన ఆశీర్వాదం. చిన్నతనం నుండే సాంప్రదాయ సంగీతం, నృత్యం, కథల రూపంలో ఉండే సాహిత్యం, ఏదైనా సాధించాలనే కల, క్రమశిక్షణతో కూడిన ఆలోచనలతో ఉన్నాను. పరిపూర్ణత గురించి ఎప్పుడూ చర్చలు ఉండకూడదు. అలాగే, నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఇది నా వారసత్వాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించే సవాల్, మరింత పరిపూర్ణత కోసం పట్టుదలతో కూడిన బాధ్యత. దానిని స్వీకరించి ముందు తరాలకు ఇవ్వాలనే నిబద్ధతో కృషి చేస్తున్నాను.
కూర్పులో సవాల్
ప్రతి ఎపిసోడ్ లోనూ కథనంలో మార్పు లేకుండా అందులోని అందాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం. సంగీతం, నృత్యం అన్నీ వేర్వేరు వ్యక్తులచే కం΄ోజ్ చేయబడ్డాయి. కౌసల్య వాత్సల్యమైనా, రాముడు– సీతల శృంగారమైనా, సీత వైభవం, హనుమంతుడి సుందరకాండ ఇలా ప్రతీది ‘అందం’లోని అంశమే ఈ నృత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని వివరిస్తుంది ఐశ్యర్వ.
Comments
Please login to add a commentAdd a comment