
సాక్షి, నెల్లూరు : నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పెట్రోల్ బంకులోనుంచి వేగంగా వచ్చిన కారు జనంపైకి దూసుకెళ్లటంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం నెల్లూరు నగరంలోని బొల్లినేని ఆసుపత్రి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. ఈ ఉదయం బొల్లినేని ఆసుపత్రి సమీపంలోని పెట్రోల్ బంకులోంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు పదిమంది వ్యక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి.
కారు అంతటితో ఆగకుండా అక్కడి ఆటోలపైకి, బైకులపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. సంఘటన జరిగిన సమయంలో జనం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment