
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ పార్క్ ముందు ఆదివారం ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపు తప్పి పార్క్ ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఆ కారులో ఉన్న ముగ్గురు యువకుల స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని చికిత్స నిమిత్తం గాయపడ్డ ముగ్గురిని సోమజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. యువకులు ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే కారు కొన్నారని, ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న..
Comments
Please login to add a commentAdd a comment