శని, ఆదివారాలు వచ్చిందంటే అంతే.. సాధారణ వ్యక్తులు రోడ్డు దాటాలన్నా కూడా కష్టం అవుతోంది.
హైదరాబాద్: శని, ఆదివారాలు వచ్చిందంటే అంతే.. సాధారణ వ్యక్తులు రోడ్డు దాటాలన్నా కూడా కష్టం అవుతోంది. ఆఫీసులకు సెలవు కావడంతో నగరంలో చాలా మంది ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడుతుంటారు. తొందరేమీ లేకున్నా మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేసుకుంటూ అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలో ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడే వారిపై కొరడా విధించారు. ఒక్కరోజులోనే 869 కేసులు నమోదు చేశారు. మితిమీరిన వేగంతో వెళ్తూ.. రోడ్డుపై న్యూసెన్స్ చేస్తున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్య స్థానాన్ని చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని పోలీసులు తెలిపారు.