ర్యాష్ డ్రైవింగ్‌తో హడలిన ప్రయాణికులు అనంతపుం జిల్లా ధర్మవరం బస్టాండ్‌లో ఆందోళనకు దిగారు.
ర్యాష్ డ్రైవింగ్‌తో హడలిన ప్రయాణికులు అనంతపుం జిల్లా ధర్మవరం బస్టాండ్‌లో ఆందోళనకు దిగారు. పుట్టపర్తి డిపో బస్సు.. చైన్నైలో శనివారం రాత్రి పుట్టపర్తికి బయల్దేరింది. డ్రైవర్ ఒక్కడే ఉండడం, కండక్టర్ బాధ్యతలను కూడా అతడే నిర్వర్తిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు చోట్ల ప్రమాదాలు తప్పాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇకపై కండక్టర్, డ్రైవర్ ఇద్దరినీ కేటాయిస్తామని ధర్మవరం డిపో మేనేజర్ రామసుబ్బయ్య హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.