కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై రెచ్చిపోయారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ఢిల్లీ సరిహద్దులోని గ్రేటర్ నోయిడాలో ఉన్న అమిటీ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు తమ ఖరీదైన కార్లతో హల్‌చల్ చేశాడు. నడిరోడ్డుపై కార్లతో స్టంట్లు చేశారు. కొందరు విద్యార్థులు నోయిడాలోని సెక్టార్ 126లో రెండు తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్ కార్లతో ఖాళీ రోడ్లపై విన్యాసాలు చేశారు. పంజాబీ ర్యాప్ పాటను హోరెత్తిస్తూ ప్రమాదకరంగా 360 డిగ్రీల స్టంట్లు చేశారు. ఒక పార్కింగ్ స్థలంలో కూడా ఒక కారుతో స్టంట్స్ చేస్తూ అక్కడున్న వారిని భయాందోళనలకు గురిచేశారు.
ఇక, విద్యార్థుల కారు స్టంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారి పోలీసులకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. అయతే, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఆ విద్యార్థులు ఖరీదైన కార్లతో ఈ విన్యాసాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, విద్యార్థుల ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NOIDA
— हिमांशु शुक्ला (@himanshu_kanpur) December 23, 2022
एमिटी यूनिवर्सिटी में रहीशजादों की स्टंटबाजी,
फॉर्च्यून से ड्रिफ्ट मरते वीडियो वायरल
PS 126@noidapolice@noidatraffic @Uppolice pic.twitter.com/4W9hVh8zBm
Comments
Please login to add a commentAdd a comment