ర్యాష్ డ్రైవింగ్: మాజీ క్రికెటర్‌పై కేసు
కటక్: అతివేగంగా కారు నడిపి పలు వాహనాలను ఢీకొట్టటంతో పాటు ఒకరు గాయపడటానికి కారణమైన మాజీ క్రికెటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశా రంజీ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ హలధర్ దాస్ ఆదివారం సాయంత్రం కటక్‌లో బైపాస్‌రోడ్‌లోని ఛాహతాఘాట్ వద్ద అతివేగంగా కారు నడిపి పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కావటంతో పాటు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బిదనాసి పోలీసులు హలధర్‌దాస్‌ను విచారించారు. హలధర్‌దాస్ కారు కూడా ఘటనలో దెబ్బతిందని పోలీసులు తెలిపారు. ఒడిశా రంజీ టీంకు 2006 నుంచి 2009 వరకు ఆయన కెప్టెన్‌గా ఉన్నారు. 2008 లో ఆ రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించారు.