
సాక్షి, విజయవాడ: నగరంలోని అయోధ్యనగర్ కరకట్ట వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపులేని వేగంతో దూసుకుపోతే రెండు ఆటోలను ఢీకొట్టింది. అంతేకాకుండా అక్కడే ఉన్న బాలుడిని సైతం కారు గుద్దేసింది. దీంతో 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. అయినా, ఏమాత్రం పట్టించుకోకుడా కారు ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా దురుసుగా వాహనాన్ని నడపడంతోనే బాలుడు మృతి చెందాడని స్థానికులు చెప్తున్నారు.