సాక్షి, హైదరాబాద్: వ్యూహం సినిమా విడుదల విషయంలో నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ తప్పదా?. తాజాగా ఆయన వేసిన పిటిషన్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనం. వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. పూర్తి సమాచారం లేకుండా వాదనలా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ తరఫున పిటిషన్ వేసేందుకు లోకేశ్‌కు ఏం అర్హత ఉందంటూ కోర్టు ప్రశ్నించింది.
‘‘ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు వద్దు.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు చెప్పండి. ఇంకా సమయం కావాలని కోరడం.. కోర్టు సమయాన్ని వృథా చేయడమే అంటూ లోకేష్ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ‘వ్యూహం’పై వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా డిసెంబర్ 29వ తేదీనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్ కోర్టు మెట్లు ఎక్కారు. తెలంగాణ కోర్టు సూచనమేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు కాంగ్రెస్, జనసేన, టీడీపీ శ్రేణులు, నారా లోకేష్, గంటా శ్రీనివాస్, ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ 'వ్యూహం' సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి.
మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డుకు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. అప్పుడు CBFC కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వర్మ దెబ్బకు బయపడిపోయిన లోకేష్ కోర్టుకు వెళ్లాడు.. సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయనే భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు.
ఇదీ చదవండి: 'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?
Comments
Please login to add a commentAdd a comment