వచ్చే ఏడాది హైకోర్టు సెలవులివే.. | Here's The List Of Telangana High Court 2025 Public Holidays And Optional Holidays, Check Details Inside | Sakshi
Sakshi News home page

TS High Court Holidays In 2025: వచ్చే ఏడాది హైకోర్టు సెలవులివే..

Published Sat, Nov 30 2024 6:19 AM | Last Updated on Sat, Nov 30 2024 10:32 AM

Telangana High Court 2025 Public Holidays

సంక్రాంతికి 5.. దసరాకు 5 రోజులు 

వేసవిలో నెలరోజులు.. 

2025 సెలవుల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది సెలవుల జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ విడుదల చేశారు. సంక్రాంతికి ఐదు.. దసరాకు ఐదు రోజులు, వేసవిలో నెల రోజులుంటాయని పేర్కొన్నారు. సాధారణ, ప్రభుత్వ, ఐచ్ఛిక సెలవులను కూడా వెల్లడించారు.   

సంక్రాంతి: జనవరి 16 (గురు), జనవరి 17 (శుక్ర) 
వేసవి: మే 5 నుంచి జూన్‌ 6 వరకు.. 
దసరా: సెపె్టంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు ప్రభుత్వ సెలవులు..  

జనవరి: నూతన సంవత్సరం 1వ తేదీ, భోగి (13న), సంక్రాంతి (14న), కనుమ (15న) 
    ఫిబ్రవరి: మహాశివరాత్రి (26న) 
    మార్చి: హోలీ (14న), రంజాన్‌ (31న) 
    ఏప్రిల్‌: బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి (5న), అంబేడ్కర్‌ జయంతి (14న),గుడ్‌ఫ్రైడే (18న) 
    జూన్‌: బక్రీద్‌ (7న) 
    జూలై: బోనాలు (21న) 
    ఆగస్టు: వరలక్ష్మీ వ్రతం (8న), స్వాతంత్య్ర దినోత్సవం (15న), శ్రీకృష్ణాష్టమి (16న), వినాయక చవితి (27న) 
    సెప్టెంబర్‌: ఈద్‌ మిలాదున్‌ నబీ(5న), దుర్గాష్టమి (30న) 
    అక్టోబర్‌: మహర్నవమి (1న), గాంధీ జయంతి (2న), నరక చతుర్థశి (20న), దీపావళి (21న), స్పెషల్‌ హాలీడే (22న)
    నవంబర్‌: కార్తీక పౌర్ణమి (5న) 
    డిసెంబర్‌: క్రిస్మస్‌ (25న),     ఫాలోయింగ్‌ డే (26న) శని/ఆదివారాల్లో వస్తున్నవి..  

గణతంత్ర దినోత్సవం: జనవరి 26న 
    ఉగాది: మార్చి 30న 
    శ్రీరామనవమి: ఏప్రిల్‌ 6న 
    మొహరం: జూలై 6న  
    బతుకమ్మ: సెప్టెంబర్‌ 21న 
ఇవికాక మహావీర్‌ జయంతి, బసవ జయంతి, బుద్ధ పూర్ణిమ.. లాంటి 12 ఐచ్ఛిక సెలవులను కూడా ప్రకటించారు. మరో మూడు ఐచ్ఛిక సెలవులు శని/ఆది వారాల్లో రానున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement