ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు
ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు
Published Fri, Feb 17 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
డీఎంఈ డాక్టర్ సుబ్బారావు
జీజీహెచ్ తనిఖీ
వైద్యసేవలపై సమీక్ష
కాకినాడ వైద్యం: ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ ఎన్.సుబ్బారావు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో శుక్రవారం సూపరింటెండెంట్ ఛాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు ఉండడంతోపాటు సేవలు మెరగవ్వడంతో వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇచ్చామన్నారు. మార్చి నెల తర్వాత అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 20 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. జీజీహెచ్‌కి వచ్చే రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రూ. 40 కోట్లతో మదర్,ఛైల్డ్ బ్లాకులు నిర్మిస్తున్మాన్నారు. మార్చి నెలాఖర్లోగా రూ. 40 కోట్ల వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు పరిపాలనామోదం ఇచ్చామని తెలిపారు. మత్తు, డయాబెటిస్ట్, గైనకాలిజిస్ట్, న్యూరాజిస్ట్ వైద్యుల కొరత ఉందని, అదనపు పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకున్నామన్నారు. జీజీహెచ్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్పు (పీపీపీ) తరహాలో సీటీస్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ ఎన్.సుబ్బారావు వైద్యులను ఆదేశించారు. ఆయన శుక్రవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య బోధనా ఆస్పత్రిని అకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఎమర్జన్సీ వార్డులను సందర్శించారు. అందుతున్న వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్‌లో వైద్య విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓపీ వేళలు, ఎమర్జన్సీ విధుల్లో వైద్యులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యుల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ వై. నాగేశ్వరరావు కోరారు. ఆయన పలు అంశాలను ఐఎంఈ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ రాఘవేంద్రరావు, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ టీఎస్‌ఆర్ మూర్తి , వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement