నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం తదితరులు
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
సాయంత్రం నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీలో బహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థా పన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. లక్ష ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టులో భాగంగా అప్రోచ్ కెనాల్, టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌస్, మోటార్ల ట్రయల్ రన్, రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతకు సంబంధించిన పైలాన్‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు.
నల్లగొండ నియోజక వర్గంలో చేపట్టబోయే మరో మూడు ఎత్తిపోతల పథకాలకు అక్కడే సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామ ర్థ్యం గల యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో పూర్తయిన యూనిట్ –2ను ప్రారంభి స్తారు. సాయంత్రం నల్లగొండ పట్టణం ఎస్‌ఎల్ బీసీలో మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా నర్సింగ్ కాలేజీ, లైబ్రరీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పట్టణంలో చేపట్టబో యే పలు అభివృద్ధి పనులకు సీఎం అక్కడే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎస్‌ఎల్‌బీసీ గ్రౌండ్‌లో నిర్వహించే బహి రంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పా ట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించి, అధికా రులతో సమీక్షించారు. దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును ఉత్తమ్, తుమ్మల, పొన్నం సందర్శించారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల వద్ద ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న పైలాన్ ను, రిజర్వాయర్‌ను మంత్రులు ఉత్తమ్, కోమటి రెడ్డి, పొన్నం పరిశీలించారు. నల్లగొండలోని మెడిక ల్ కళాశాలను, సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు పార్టీలకతీతంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment