సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండలో బీఆర్‌ఎస్ ఆఫీసును కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. 15 రోజుల్లోనే బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, నల్లగొండలో బీఆర్‌ఎస్ ఆఫీసుకు మున్సిపల్ పర్మిషన్ లేదని దాన్ని కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ ఆఫీసు రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖను ఆదేశాలు ఇవ్వాలని పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఇక, వాదనల సందర్భంగా కోర్టు.. అక్కడ ఆఫీస్ కట్టకముందే అనుమతి తీసుకోవాలి కదా. ఆఫీసు కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. పార్టీ ఆఫీసు నిర్మాణం చట్ట ఉల్లంఘనే అవుతుంది. కార్యాలయం నిర్మాణంలో చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. అనంతరం, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను 15 రోజుల్లో కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా
Comments
Please login to add a commentAdd a comment