తెలంగాణ డీఎస్సీలో టాపర్‌గా నిలిచిన రెంటచింతల యువకుడు
సీఎం రేవంత్‌రెడ్డి నుంచి నియామక పత్రం అందుకున్న బాషా
రెంటచింతల: రెంటచింతలకు చెందిన షేక్ అలీం బాషా హిందీ పండిట్‌గా పనిచేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో నల్గొండ జిల్లా స్థాయిలో హిందీలో మొదటి ర్యాంక్ సాధించి నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలిచాడు. గ్రామంలోని సుబ్బన్నతోట కాలనీకి చెందిన అలీం బాషా గత ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన మైనార్టీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పాఠశాలలో హిందీ పండిట్‌గా ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీకి నాన్‌లోకల్ కోటాలో నల్గొండ జిల్లాలో ప్రవేశ పరీక్ష రాశాడు. హిందీలో మొదటి ర్యాంక్ సాధించి నల్గొండ జిల్లా టాపర్‌గా నిలిచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో నియామక పత్రాన్ని అందుకున్నారు.
మంగళవారం నిర్వహించనున్న కౌన్సెలింగ్‌లో పాఠశాల కేటాయిస్తారని అలీం బాషా తెలిపాడు. రెండు నెలల వ్యవధిలో రెండు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అలీం బాషా నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలిచాడు. బాషాను గ్రామస్తులు అభినందలతో ముంచెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment