ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ | Theft In Actor Mohan Babu House Latest | Sakshi
Sakshi News home page

Mohan Babu: రూ.10 లక్షలు చోరీ.. దొంగ అరెస్ట్

Published Wed, Sep 25 2024 11:10 AM | Last Updated on Wed, Sep 25 2024 1:20 PM

Theft In Actor Mohan Babu House Latest

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఈయనకు చెందిన జల్‌పల్లిలోని ఫామ్‌హౌస్‌లో నాయక్ అనే వ్యక్తి పనిమనిషిగా చేస్తున్నాడు. ఇతడే దాదాపు రూ.10 లక్షలు దొంగిలించి ఉడాయించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. అలా తిరుపతిలో నాయక్‌ని అదుపులోకి తీసుకున్నారు.

(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)

గతంలో ఇదే ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియోని మంచు లక్ష‍్మి తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. విలాసవంతమైన ఈ ఇంటిలో దొంగతనం జరగడం ఇదే కొత్తం కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయి.

ఇకపోతే తెలుగులో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బోలెడన్ని సినిమాలు చేసిన మోహన్ బాబు.. చివరగా 'సన్నాఫ్ ఇండియా' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో 'కన్నప్ప' తీస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోస్టర్స్ వదులుతున్నారు. త్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశముంది.

(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement