యూకే షాడో ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ, భారతీయ వ్యాపారవేత్తల మధ్య జరిగిన సమావేశంలో.. లండన్‌లో రోలెక్స్ వాచ్ దొంగతనాల అంశాన్ని ప్రస్తావించారు. సమావేశాలకు లేదా వ్యాపార అవసరాల నిమిత్తం లండన్ వెళ్లినప్పుడు తమవెంట ఖరీదైన వస్తువులు కూడా తీసుకెళ్తారు. అలాంటి వస్తువులు దొంగతనానికి గురైనట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశంలో వెల్లడించారు.
లగ్జరీ వాచ్‌లు, మొబైల్స్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగులు సైతం దొంగలిస్తున్నారని పలు కంపెనీల సీఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు. 2022తో పోలిస్తే.. గతేడాది దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. 2023లో దొంగతనాలు ఏకంగా 27 శాతం పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
2022లో 52 వేల దొంగతనాలు నమోదవగా, 2023లో 72 వేల కేసులు నమోదైనట్లు మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. గత ఐదేళ్లలో లండన్‌లో దాదాపు 29,000 వాచీ దొంగతనాలు జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది జాతీయ ఎన్నికలకు ముందు బ్రిటన్‌లో పెరుగుతున్న నేరాలు ఇప్పుడు రాజకీయ సమస్యగా మారాయి.
ఇదీ చదవండి: 'వీసా లేకుండా ఎంట్రీ' - ఇరాన్ నాలుగు షరతులు ఇవే..
లండన్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రత లేకపోతే మేము ఎందుకు రావాలని సీఈఓలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపైన ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలి, బ్రిటన్ ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించాలని వ్యాపారవేత్తలు వెల్లడించారు. ఈ దొంగతనాలను తగ్గించడానికి లండన్ పోలీసులు అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించి తగ్గించడానికి పూనుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment