సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో తప్పనిసరైన ఆన్‌లైన్ తరగతులతో పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు మరింతగా అతుక్కుపోతున్నారు. వీరు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లతోనే గడిపే సమయం రెట్టింపుకావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లోని 5 – 15 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులతో ‘ఓఎల్‌ఎక్స్ ఇండియా’ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. (ఆటలను మింగేసిన కరోనా..)
ఆ సర్వేలోని ప్రధాన అంశాలు..
► తమ పిల్లలు విపరీతంగా ల్యాప్‌టాప్, మొబైల్‌లకు అతుక్కుపోతున్నారని 84 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
► రోజుకు కనీసం 5 గంటలసేపు తమ పిల్లలు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లతో ఉంటున్నారని 54 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు.
► పిల్లలకు అనవసరమైన, విద్యా సంబంధంకాని విషయాలు, అందుబాటులోకి వస్తున్నాయని 57 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తమకు తెలియకుండానే ఆ సమాచారానికి ఆకర్షితులైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
► అయినప్పటికీ, 57 శాతం మంది తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తమ పిల్లలకు ఎలాంటి అనవసరమైన, ప్రమాదకరమైన విషయాలు అందుబాటులో ఉండకుండా చేసేందుకు ఉన్న ఆప్షన్లను వాడుకోవడం లేదు.
► టీనేజీ పిల్లల తల్లిదండ్రుల్లో 50 శాతం మంది తమ పిల్లల ఆన్‌లైన్ చదువులు, బ్రౌజింగ్ మీద ఎలాంటి నియంత్రణ చూపడం లేదు.
► ప్రమాదకరమైన సైట్లు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు పాటించడం లేదు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రుల్లో 50 శాతం మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment