మమ్ములను కూడా మోసం చేసిండ్లు | a gang cheated to Women's groups | Sakshi
Sakshi News home page

మమ్ములను కూడా మోసం చేసిండ్లు

Published Sat, Sep 6 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

మమ్ములను కూడా మోసం చేసిండ్లు

మమ్ములను కూడా మోసం చేసిండ్లు

శాయంపేట : రాజీవ్ యువకిరణాలు, తక్కువ ధరకు ల్యాప్‌టాప్‌లు, వాషింగ్‌మిషన్ల స్కీమ్‌తో ఓ ముఠా మహిళలను మోసగించిన వైనంపై ‘మహిళా సంఘాలకు కుచ్చుటోపి’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితం కావడంతో బాధిత మహిళలు ఐకేపీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిలో మండలంలోని మైలారం, పత్తిపాక, వసంతాపూర్, శాయంపేటకు చెందిన సుమారు 50 మంది ఉన్నారు. తమను కూడా ఇలాగే మోసగించి.. డబ్బులు తీసుకెళ్లారని తమ గోడు వెల్లబోసుకున్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కొంతమంది భర్తలకు తెలియకుండా తమ ఇంట్లో దాచుకున్న డబ్బులు చెల్లించగా.. మరికొంత మంది తమ కుమారులు పనిచేసి తీసుకొచ్చిన జీతాలను వారికి ముట్టజెప్పారు. కాగా అందరు కలిసి తమకు జరిగిన అన్యాయాలను ఒకరికొకరు చెప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement