
అక్కడ ల్యాప్‌టాప్‌లు కేజీల్లో అమ్ముతారు..!
సాధారణంగా పండుగ సమయాల్లో షాపింగ్‌మాల్స్ భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి.
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పండుగ సమయాల్లో షాపింగ్‌మాల్స్ భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆషాఢం సేల్, శ్రావణ మాసం సేల్ పేరుతో కేజీల చొప్పున దుస్తులు అమ్మడం చూస్తుంటాం. అలా కేజీల్లో ల్యాప్‌టాప్‌లు అమ్మితే ఎలా ఉంటుంది. మనకు కావాల్సిన ల్యాప్‌టాప్‌ను అతి తక్కువ ధరలో మన సొంతం చేసుకోవచ్చు అనుకుంటాం కదా. అయినా ల్యాప్‌టాప్‌లు ఎక్కడైనా కేజీల్లో అమ్ముతారా అని సందేహమే అవసరం లేదు.
ఢిల్లీలో ఉన్న నెహ్రూ ప్లేస్ ల్యాప్‌టాప్ మార్కెట్‌లో అతి తక్కువ ధరకే లాప్‌టాప్‌లు కిలోల చొప్పున అమ్ముతారు. ఇది భారతదేశంలోనే కాక ఆసియాలో అతిపెద్ద, చౌకైన ల్యాప్‌టాప్ మార్కెట్. ఇక్కడ కిలో రూ.5-7 వేలకే ల్యాప్‌టాప్ కొనుక్కోవచ్చు. ఈ నెహ్రూ ప్లేస్‌లో దుకాణాలు వందల్లో ఉన్నాయి, ఈ మార్కెట్లో కేవలం ల్యాప్‌టాప్‌లు మాత్రమే కాదు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర కంప్యూటర్, మొబైల్ యాక్ససరీస్ కూడా తక్కువ ధరలలో లభిస్తాయి. అయితే వాటిని కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరీక్షించి తీసుకోవాలి. లేకపోతే వినియోగదారుడి చెవిలో పూలు పెట్టడం ఖాయం.