లాప్‌టాప్ దొంగల అరెస్టు
వేర్వే రు కేసుల్లో లాప్‌టాప్‌లు దొంగిలించిన ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షల విలువ చేసే నాలుగు లాప్‌టాప్‌లను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. గవర్నర్‌పేటలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
విజయవాడ :
వేర్వే రు కేసుల్లో లాప్‌టాప్‌లు దొంగిలించిన ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షల విలువ చేసే నాలుగు లాప్‌టాప్‌లను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. గవర్నర్‌పేటలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తంగుడు అఖిల్ ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అతను తన మిత్రుల వద్ద మూడు లాప్‌టాప్‌లను ఈ నెల 15న అపహరించాడు. వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన చిట్టెల శ్యామ్‌ప్రసాద్ గత నెల 29వ తేదీ గవర్నర్‌పేట పోలీస్‌స్టేçÙన్ పరిధిలో మహాలక్ష్మి టవర్స్‌లో లాప్‌టాప్ అపహరించాడు. దాన్ని విక్రయించే ప్రయత్నంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు.