అఖిలేష్ లాప్ టాప్ లో మోడీ సీడీలు!
రాజకీయంగా విభేధిస్తున్నప్పటికి ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోడీకి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ప్రచారం చేయకతప్పడం లేదు
లక్నో: రాజకీయంగా విభేధిస్తున్నప్పటికి ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోడీకి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ప్రచారం చేయకతప్పడం లేదు. ఉపాధ్యయ దినోత్సవం సందర్భంగా మోడీ ప్రసంగాన్ని లక్షలాది మంది విద్యార్ధులకు చేరేలా తగిన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్ధులకు అందేలా తగిన చర్యలు తీసుకునే ఏర్పాటు చేయాలని యూపీ మాధ్యమిక విద్యాశాఖకు విభాగానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి.
ఇప్పటికే యూపీ లో పంపిణీ చేసిన మోడీ ప్రసంగ సీడీలను లాప్ టాప్ లో చూపించాలని అధికారులకు రాష్ట్ర ప్రధానాధికారి నవీత్ సెహగల్ సూచించారు. ఈ మేకు పాఠశాలకు, మాధ్యమిక విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు.