సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, అలియా జంటగా నటించిన బాలీవుడ్ మూవీ గల్లీబాయ్ లోని అప్నా టైం ఆయేగా పాటను రైల్వే మంత్రి పియూష్ గోయల్ బాగా వాడేశారు. ఇదే సాంగ్ థీమ్ తో ‘తేరా టైం ఆయేగా’ అంటూ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక చేశారు.
టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రైల్వే ప్రయాణికులను ఉద్దేశించి ‘తేరా టైం ఆయేగా అంటూ ఫన్ ట్రాక్‌తో రూపొందించిన సాంగ్ ఇపుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. దీన్ని స్వయంగా పీయూష్ గోయల్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న అప్నా టైం పాట తరహాలో టికెట్ లేని ప్రయాణం నేరం అనే అవగాహనను ప్రయాణీకుల్లో కల్పించేందుకు ప్రయత్నించారు. దీంతో ‘తేరాం టైం’ రీమిక్స్ సాంగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైలులో టీసీ టిక్కెట్లు తనిఖీ, టిక్కెట్లు లేని వారికి జరిమానా విధింపు, ప్రయాణికుల ఫొటోలతో కూడిన సాంగ్ ట్రాక్ మ్యూజిక్ వీడియోను పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘టికెట్ లేకుండా ప్రయాణం చేయకండి... యూటీఎస్ యాప్, ఏటీవీఎం మెషీన్ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయండి’ అంటూ, దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో పాట పూర్తవుతుంది.
Tera Time Aayega pic.twitter.com/3JI8SoPx3u
— Piyush Goyal (@PiyushGoyal) February 18, 2019
Comments
Please login to add a commentAdd a comment