'గల్లీ బాయ్‌'కి అవార్డుల పంట | 65th Amazon Filmfare Awards 2020 | Sakshi
Sakshi News home page

ఘనంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. 'గల్లీ బాయ్‌'కి అవార్డుల పంట

Published Sun, Feb 16 2020 2:02 PM | Last Updated on Sun, Feb 16 2020 2:44 PM

65th Amazon Filmfare Awards 2020 - Sakshi

బాలీవుడ్‌లో ఏటా అట్టహాసంగా నిర్వహించే ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2020 వేడుకకు బాలీవుడ్ నటీనటులు తరలివచ్చారు. ఈ వేడుకకు నిర్మాత కరణ్‌జోహార్‌, నటుడు విక్కీ కౌశల్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అసోంలోని గువాహటిలో ఉన్న ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించారు. 

2019లో బాలీవుడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు ప్రధానం చేశారు. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన ‘గల్లీ బాయ్’ సినిమా ఏకంగా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఫిలిం ఫేర్ వేడుకలో రణ్‌వీర్‌ సింగ్‌, కార్తీక్‌ ఆర్యన్‌, మాధురీ దీక్షిత్‌ తమ డ్యాన్సులతో అదరగొట్టారు. ఇక ఈ అవార్డ్స్‌లో 'గల్లీ బాయ్' సినిమా ఎక్కువ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకురాలిగా  జోయా అక్తర్‌, ఉత్తమ నటుడుగా రణ్‌వీర్‌ సింగ్‌, ఉత్తమ నటిగా ఆలియాభట్‌, ఉత్తమ సహాయ నటుడుగా సిద్ధాంత్‌ చతుర్వేది. అవార్డులను గెలుచుకున్నారు. 

65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విజేతలు..
ఉత్తమ నటుడు – రణ్‌వీర్ సింగ్
ఉత్తమ నటి – ఆలియా భట్
ఉత్తమ చిత్రం – గల్లీ బాయ్ 
ఉత్తమ డైరెక్టర్ – జోయా అక్తర్ (గల్లీ బాయ్)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) – సోంచిడియా, ఆర్టికల్ 15
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – ఆయుష్మాన్ ఖురానా (ఆర్టికల్ 15)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – తాప్సి, భూమి పెడ్నేకర్ (సాండ్ కి ఆంఖ్)
ఉత్తమ సహాయ నటుడు – సిద్ధాంత్ చతర్వేది (గల్లీ బాయ్)
ఉత్తమ సహాయనటి – అమృతా సుభాష్ (గల్లీ బాయ్)
ఉత్తమ లిరిక్స్ – డివైన్, అంకుర్ తివారి (సాంగ్ : అప్నా టైమ్ ఆయేగా)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ – గల్లీ బాయ్, కబీర్ సింగ్
ఉత్తమ నేపథ్య గాయని – శిల్పా రావ్ (సాంగ్: ఘుంగ్రూ)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అర్జీత్ సింగ్ (సాంగ్: కలంక్ నహి)
ఉత్తమ తొలిపరిచయ నటుడు – అభిమన్యు దస్సాని (మర్ద్ కో దర్ద్ నహీ హోతా)
ఉత్తమ తొలిపరిచయ నటి – అనన్య పాండే (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు – ఆదిత్య ధార్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
ఉత్తమ యాక్షన్ – పాల్ జెన్నింగ్స్, ఓ సీ యంగ్, పర్వేజ్ షేక్, ఫ్రాంజ్ స్పిల్హాస్ (వార్)
ఉత్తమ కొరియోగ్రాఫర్ – రెమో డిసౌజా (సాంగ్ : ఘర్ మోరే పర్దేశియా)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – కర్ష్ కాలే, ది సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ (గల్లీ బాయ్)
ఉత్తమ కాస్ట్యూమ్ – దివ్య గంభీర్, నిధి గంభీర్ (సోంచిడియా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – జాయ్ ఓజా (గల్లీ బాయ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సుజన్నే కప్లాన్ మేర్వాన్‌జి (గల్లీ బాయ్)
ఉత్తమ ఎడిటింగ్ – శివకుమార్ వి పనికెర్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
ఉత్తమ వీఎఫ్ఎక్స్ – షెర్రీ భార్దా, విశాల్ ఆనంద్ (వార్)
ఉత్తమ సౌండ్ డిజైన్ – విశ్వదీప్ ఛటర్జీ, నిహార్ రంజన్ సామల్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే – రీమా కగ్తి, జోయా అక్తర్
ఉత్తమ మాటల రచయిత – విజయ్ మౌర్య (గల్లీ బాయ్) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement