‘గల్లీ బాయ్‌’ రీమేక్‌లో మెగా హీరో | Sai Dharam Tej in Gully Boy Telugu Remake | Sakshi
Sakshi News home page

‘గల్లీ బాయ్‌’ రీమేక్‌లో మెగా హీరో

Published Tue, Feb 19 2019 11:19 AM | Last Updated on Tue, Feb 19 2019 11:20 AM

Sai Dharam Tej in Gully Boy Telugu Remake - Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా గల్లీ బాయ్‌. జోయా అక్తర్ దర్శకత‍్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో రణ్‌వీర్‌ పోషించిన రాప్‌ సింగర్‌, గల్లీ బాయ్‌ పాత్రకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలుగులోనూ గల్లీ బాయ్‌ని రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలు ఈ యూత్‌ఫుల్ రీమేక్‌లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర లహరి షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ రీమేక్‌లో నటించేందకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. మరి నిజంగానే ఈ మెగా హీరో గల్లీ బాయ్ రీమేక్‌ను పట్టాలెక్కిస్తాడో లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement