Jailer vs Indian 2: Rajinikanth and Kamal Haasan to have a clash at box office after 18 years - Sakshi
Sakshi News home page

Indian 2 Vs Jailer:18 ఏళ్ల తర్వాత మళ్లీ బాక్సాఫీస్‌ బరిలో రజనీకాంత్‌, కమల్‌!

Published Tue, Feb 7 2023 9:49 AM | Last Updated on Tue, Feb 7 2023 10:38 AM

Indian 2 Vs Jailer: Rajinikanth And Kamal Haasan To Have Clashed At Box Office - Sakshi

లోకనాయకుడు కమలహాసన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వీరిద్దరూ తమిళ సినిమాకి రెండు ధృవాలు లాంటి వారు. తొలి దశలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత ఎవరి ఇమేజ్‌ వారికి రావడంతో విడివిడిగా నటించడం మొదలెట్టారు. కాగా ఇటీవల విక్రమ్‌ చిత్రంతో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చిన కమలహాసన్‌ ప్రస్తుతం ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి కాజల్‌ అగర్వాల్, రకుల్‌ ప్రీతిసింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

మరో పక్క నటుడు రజనీకాంత్‌ నెల్సన్‌ దర్శకత్వంలో నటిస్తున్న జైలర్‌ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాప్, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ జైపూరులో జరుగుతోంది. కాగా ఈ రెండు చిత్రాలు ఒకే రోజు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

2005 ఏప్రిల్‌ 14న రజనీకాంత్‌ చంద్రముఖి, కమలహాసన్‌ ముంబయి ఎక్స్‌ప్రెస్‌ చిత్రాలు విడుదలై పోటీపడ్డాయి. అప్పట్లో చంద్రముఖి చిత్రం ఘన విజయాన్ని సాధించింది. మళ్లీ 18 ఏళ్ల తరువాత రజనీకాంత్‌ జైలర్‌ చిత్రం, కమలహాసన్‌ ఇండియన్‌–2 ఒకే రోజు విడుదల కానున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement