
ముంబై : బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్, యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన వార్ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న వార్ బ్లాక్‌బస్టర్ సినిమాల లైఫ్‌టైమ్ వసూళ్లను క్రాస్ చేస్తోంది. రూ 300 కోట్ల వసూళ్లకు చేరువైన వార్ ఇప్పటికే ధూమ్ 3 లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించింది. ఈ వారాంతంలోనే సుల్తాన్ లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమిస్తుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మరోవైపు బుధవారం నాటికి వార్ దేశవ్యాప్తంగా రూ 284 కోట్ల వసూళ్లతో రూ 300 కోట్ల మార్క్‌ను దాటే దిశగా ఉరకలు వేస్తోంది. ఇక ఈ ఏడాది సూపర్ 30, వార్‌తో వరుస హిట్లు కొట్టిన హృతిక్ రోషన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment