థియేటర్లలో 200 రోజులు.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది: మోహన్ బాబు | Mohan Babu Shares His Hit Movie Assembly Rowdy Gives Me Special title | Sakshi
Sakshi News home page

Mohan Babu: కలెక్షన్‌ కింగ్‌ టైటిల్.. ఆ సినిమాతోనే వచ్చింది: మోహన్ బాబు

Dec 25 2024 4:05 PM | Updated on Dec 25 2024 4:15 PM

Mohan Babu Shares His Hit Movie Assembly Rowdy Gives Me Special title

టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తనదైన నటనతో వెండితెరపై అభిమానులను ‍అలరించారు. ఆయన తన కెరీర్‌లో నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల తన బ్లాక్‌ బస్టర్‌ను చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో డైలాగ్స్, సీన్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మరో మూవీకి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

1991లో మోహన్ బాబు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. థియేటర్లలో 200 రోజులు ఆడి కలెక్షన్ కింగ్ అనే బిరుదును మోహన్‌ బాబుకు అందించింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. పి.వాసు, పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమాకు కథను అందించారు. కేవీ మహదేవన్ సంగీమందించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో గొప్ప మెలురాయిగా నిలిచిపోయిందన్నారు.

మోహన్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' అసెంబ్లీ రౌడీ (1991) నా సినీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్, కామెడీ డ్రామాలో శక్తివంతమైన పాత్రను పోషించాను. ఆకట్టుకునే కథాంశంతో  పి.వాసు, పరుచూరి బ్రదర్స్‌ అందించిన ఇంపాక్ట్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ఈ సినిమాకు నా కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. థియేట‌ర్ల‌లో 200 రోజులు ఆడి రికార్డుల మోత మోగించింది. క‌లెక్ష‌న్ కింగ్ అనే బిరుదు అందించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలోని కేవీ మహదేవన్  మ్యూజికల్ హిట్‌లు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి' అంటూ పోస్ట్ చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement