
ముంబై : బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల వార్ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ మూవీ వసూళ్ల సునామీ మామూలుగా లేదు. మూడు రోజుల్లోనే రూ వంద కోట్ల క్లబ్‌లో చేరిన వార్ నాలుగు రోజుల్లో రూ 125 కోట్లుపైగా వసూలు చేసి 150 కోట్ల మార్క్‌కు చేరువవుతోంది. శనివారం రూ 25 కోట్లు కలెక్ట్ చేసిన వార్ లాంగ్ రన్‌లో భారీ వసూళ్లపై కన్నేసింది. వెండితెరపై తమ హీరోలను చూసుకునేందుకు హృతిక్ రోషన్, టైగర్‌ల అభిమానులు థియేటర్లకు తరలివస్తుండటంతో భారీ వసూళ్లు నమోదవుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment