శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం 'అమరన్'. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. శివ కార్తికేయన్ కెరిర్‌లో ఒక మైల్‌స్టోన్ లాంటి సినిమాగా అమరన్ నిలిచిపోనుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు.
వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటిరోజే రూ. 35 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మూడురోజులకు ప్రపంచవ్యాప్తంగా అమరన్ కలెక్షన్స్ రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరింది. కేవలం తమిళనాడులోనే రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది.
రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన అమరన్.. శివ కార్తికేయన్ కెరీర్‌లో ఇదే ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ కెక్కింది. ఆయన నటించిన గత సినిమాలు రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు డాక్టర్ (25 రోజులు), డాన్ (12రోజులు) పట్టింది. అయితే, ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమరన్ చిత్రాన్ని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు రజనీకాంత్ కూడా చూశారు. సినిమా బాగుందంటూ వారు ప్రశంసించారు. ఈ సినిమాను నిర్మించిన కమల్ హాసన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమిళనాడులోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మేజర్ 'ముకుంద్ వరద రాజన్' జీవిత కథతో ఈ సినిమాను రూపొందించారు. 2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ ఆయన అసువులు బాసిన వీరుడిగా నిలిచారు. ఆయన పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment