ముకేశ్ అంబానీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ బాలీవుడ్ లో పాకిస్థాన్ కళాకారుల నిషేధం వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో నిర్వహించిన ఇంటర్ యాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, బర్ఖాదత్ ఆద్వర్యంలో ది ప్రింట్ నిర్వహించిన ఆఫ్ ది కఫ్ షో లో ఆయన పాకిస్తాన్ నటుల పై నిషేధాన్ని పరోక్షంగా సమర్థించి సంచలనం రేపారు.
కళలు, సంస్కృతి కన్నా తనకు భారతదేశమే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. నేషన్ కమ్స్ ఫస్ట్ అనీ ఈ విషంయలో తాను చాలా క్లియర్ గా ఉన్నాననీ వ్యాఖ్యానించారు. తాను మేధావిని కాననీ , తనకు ఇవన్నీ అర్థం కావని చెప్పారు కానీ నిస్సందేహంగా భారతీయులందరిలాగానే తనకు దేశమే ముఖ్యమనీ, మొదటి స్థానంలో భారతదేశం ఉంటుందని అంబానీ చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా రాజకీయాల్లో చేరతారా అని ప్రశ్నించినపుడు దానికి ప్రతికూల సమాధాన మిచ్చారు తనకు రాజకీయాలు అచ్చిరావన్నట్టు అంబానీ మాట్లాడారు.
కాగా సర్జికల్ దాడుల నేపథ్యంలో పాక్ - ఇండో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ థాకరే పాకిస్తాన్ నటులను దేశంనుంచి విడిపోవాలన్న వ్యాఖ్యలతో దుమారం రేగింది. మరోవైపు పాకిస్టాన్ నటులు నటించిన యేదిల్ హై ముష్కిల్ సినిమానను ప్రదర్శించబోమని మహారాష్ట్ర, గుజరాత్,కర్ణాటక, గోవా కు చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమాను తేల్చిచెప్పారు. అటుసల్మాన్, ప్రియాంకా తదితరులంతా పాక్ నటులపై ఎందుకు నిషేధం విధించారంటూ ప్రశ్నించడం పెనుదుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.