చీపురుపల్లి తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
Published Tue, Feb 4 2014 2:35 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
చీపురుపల్లి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో వసూళ్లకు పాల్ప డి ఉద్యమాన్ని నడిపించారని, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారినుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలతో చీపురుపల్లి తహశీల్దార్ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ కాంతి లాల్ దండే సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తహశీల్దార్ సస్పెన్షన్ వెనుక రాజకీయ కారణాలున్నాయ న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నియోజకవర్గం. నిబంధనలకు విరుద్ధమైనా ఇక్కడ అధికా ర పార్టీ నాయకులు చెప్పింది చేయాల్సిందే. వారు ఆదేశించిందే వేదంగా పని చేస్తేనే ఉద్యోగంలో ఉంటారు.
లేకుంటే బదిలీయే కాదు ఏకంగా సస్పెన్షనే ఉద్యోగులకు బహుమానం గా దక్కుతుంది. అందుకు ఉదాహరణే చీపురుపల్లి తహశీల్దార్ టి.రామకృష్ణ సస్పెన్షన్ అని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పింది వినడం లేదన్న అక్కసుతోనే మంత్రి బొత్స స్థాయిలో కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి తహశీల్దార్‌ను సస్పెండ్ చేయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్ రామకృష్ణ, అధికార పార్టీ నాయకులను పక్కన పెట్టడమే కాకుండా పరోక్షంగా ఇతర పార్టీ నాయకులకు సహకరి స్తున్నారన్న అక్కసు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకంగా ఏసీబీ ట్రాప్ చేయించేం దుకు కూడా ఇటీవల పూనుకున్నారన్న వాదనలు కూడా వినిపించాయి. రాజ కీయ కారణాలతో సస్పెన్షన్ వేటు వేయించడం అన్యాయమంటూ అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది.
Advertisement
Advertisement