Legend Usha Uthup: ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. కేవలం తన గొంతులో మాత్రమే ప్రత్యేకతను నింపుకోలేదు..ఆమె ఆహార్యం కట్టూ, బొట్టూ అన్నీ స్పెషలే. ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ఉష ఒక నటి, సామాజిక కార్యకర్త కూడా. ప్రత్యేకమైన శైలి, వాయిస్‌తో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసిన లెజెండరీ సింగర్. అయితే, ఉషా ఉతుప్ కట్టుకునే చీరలు చూస్తే ఆమెకు సారీస్ మీద పెద్ద మోజు ఇట్టే అర్థమైపోతోంది. దేశంలో అన్ని రంగాల చీరల కలెక్షన్ ఆమె వద్ద ఉంది. ఈ లిస్ట్ దాదాపు 600కు పై మాటే.
ఉషా ఉతుప్ సారీస్ అండ్ సాంగ్స్
లతాజీ ,ఆశా జీ (లతా మంగేష్కర్ , ఆశా బోన్స్లే)తో సహా ప్రఖ్యాత గాయకులకు బాలీవుడ్ హీరోయిన్ల పాటలు పాడుతుంటే, వాంప్‌ల కోసం పాడమని నన్ను అడిగేవారు. కానీ దాన్ని కూడా నేను బ్రేక్ చేశాను. రేఖ, శ్రీదేవి లాంటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లకు పాటలు పాడాను అంటారు ఉషా. పంజాబీ, బెంగాలీ, మరాఠీ , హిందీ, తెలుగు భాషల్లో అనేక పాటలకు తన గాత్రాన్ని అందించిన ఘనత ఆమె సొంతం. ‘‘నాకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉన్నందుకు గర్వపడుతున్నా..నేను ఎవరిలాగానో పాడలేను..నాలాగా మాత్రమే పాడతాను. అందరికీ భిన్నంగా స్టేజ్ మీద ఎలా అలరించాలో అలాగా చేస్తాను.’’ ఇదీ ఉషా స్టయిల్. (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేల మందికి ఉపాధి)
ప్రతీ భారతీయ అమ్మాయికి చీర ఒక అబ్సెషన్. చిన్నతనంలోనే అమ్మ చీరను చుట్టకుని మురిసిపోయేంత ప్రేమ. ఈ నేపథ్యంలో ఖరీదైన వందల చీరలు ఉషా వార్డ్‌రోబ్‌లోకి కొలువు దీరాయి. అలాగే తన తల్లి అనుభవాలను కూడా ఆమె మీడియాతో పంచకున్నారు. మధ్యతరగతి మహిళ తన తల్లికి ఎక్కువ చీరలు కొనే స్థోమత లేకపోయిందని ఉషా ఉతుప్ గుర్తు చేసుకున్నారు. అలాగే తన తల్లి గడి, చుక్కలు, చారలు అంటే చాలా ఇష్టపడేవారి చెప్పారు.
ముఖ్యంగా తన చీరల్లో పూజ బోర్డర్, బంగారు హంసలున్న మావ్-హూడ్ కాంజీవరం చీర చాలా ఖరీదైందని చెప్పారు. అంతేకాదు చాలా పాతదే అయినా ఈ ట్రెడిషనల్ చీరంటే తన కుమార్తెకు కూడా చాలా ఇష్టమనట. ఈ సందర్బంగా మరో విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు)
బ్లాక్ సారీ అంటే..
నలుపు రంగు చీర కట్టుకున్నప్పుడల్లా తన అత్తగారికి చాలా కోపం వచ్చేదని చెప్పారు. తమిళ అయ్యర్ కుటుంబం నుండి వచ్చిన తనకు బ్లాక్ సారీస్ అంటే చాలా ఇష్టంమని, సాధారణంగా ఇక్కడి మహిళలు నలుపు రంగును మహిళలందరూ ఇష్టపడతానన్నారు. అయితే కేరళకు చెందిన కుటుంబాన్ని వివాహం చేసుకున్నా.. అందుకే నల్ల చీర కట్టుకున్నప్పుడల్లా అత్తగారికి కోపం వచ్చేది అంటూ తన కెంతో ఇష్టమైన నల్లటి చీరను కూడా చూపించారు.
ఉషా ఉతుప్ తొలి సంపాదన
ఉషా ఉతుప్ తొలి సంపాదన నెలకు రూ. 750. తాను యాదృచ్ఛికంగా తన ఆంటీ సహాయంతో సింగింగ్‌లో వచ్చానన్నారు. అప్పుడపుడూ కొన్ని గిగ్‌లు పొందడానికి సహాయం చేసింది. అలా సింగింగ్ మీద ఆసక్తి పెరిగింది. ఒక హోటల్‌తో నైట్‌క్లబ్ గాయనిగా చేరారు. అక్కడ నెలకు రూ. 750 వచ్చేది అని చెప్పారు. నిజంగా ఆ సమయంలో డబ్బు సంపాదించడంలో థ్రిల్ వేరే అంటారు ఉష.
Comments
Please login to add a commentAdd a comment