Usha Uthup
-
ప్రముఖ గాయని భర్త కన్నుమూత
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గాయని భర్త జానీ చాకో (78) గుండెపోటుతో సోమవారం కన్నుమూశారు. ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో జానీకి ఛాతీలో నొప్పి మొదలైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. గుండెపోటు వల్లే మరణించినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఉషాకు ఈయన రెండో భర్త. వీరికి సన్నీ అనే కుమారుడు, అంజలి అనే కూతురు ఉన్నారు. ఉషా ఉతుప్ విషయానికి వస్తే.. ఈమె తన విభిన్నమైన స్వరంతో సంగీతప్రియులను ఉర్రూతలూగించింది. క్లాసికల్ అయినా, వెస్ట్రన్ అయినా అలవోకగా పాడేది. మొదట్లో నైట్ క్లబ్ సింగర్‌గా ఉన్న ఆమె తర్వాత సినిమాల్లోకి వచ్చింది.కీచురాళ్లు టైటిల్ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు ఆలపించింది. సంగీత ప్రపంచంలో తన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2011లో పద్మశ్రీతో సత్కరించగా ఈ ఏడాది పద్మ భూషణ్ అందించింది.చదవండి: నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్దార్థ్ -
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
సింగర్ ఉషా తొలి జీతం ఎంతో తెలుసా? వావ్ అనిపించే చీరల కలెక్షన్
Legend Usha Uthup: ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. కేవలం తన గొంతులో మాత్రమే ప్రత్యేకతను నింపుకోలేదు..ఆమె ఆహార్యం కట్టూ, బొట్టూ అన్నీ స్పెషలే. ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ఉష ఒక నటి, సామాజిక కార్యకర్త కూడా. ప్రత్యేకమైన శైలి, వాయిస్‌తో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసిన లెజెండరీ సింగర్. అయితే, ఉషా ఉతుప్ కట్టుకునే చీరలు చూస్తే ఆమెకు సారీస్ మీద పెద్ద మోజు ఇట్టే అర్థమైపోతోంది. దేశంలో అన్ని రంగాల చీరల కలెక్షన్ ఆమె వద్ద ఉంది. ఈ లిస్ట్ దాదాపు 600కు పై మాటే. ఉషా ఉతుప్ సారీస్ అండ్ సాంగ్స్ లతాజీ ,ఆశా జీ (లతా మంగేష్కర్ , ఆశా బోన్స్లే)తో సహా ప్రఖ్యాత గాయకులకు బాలీవుడ్ హీరోయిన్ల పాటలు పాడుతుంటే, వాంప్‌ల కోసం పాడమని నన్ను అడిగేవారు. కానీ దాన్ని కూడా నేను బ్రేక్ చేశాను. రేఖ, శ్రీదేవి లాంటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లకు పాటలు పాడాను అంటారు ఉషా. పంజాబీ, బెంగాలీ, మరాఠీ , హిందీ, తెలుగు భాషల్లో అనేక పాటలకు తన గాత్రాన్ని అందించిన ఘనత ఆమె సొంతం. ‘‘నాకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉన్నందుకు గర్వపడుతున్నా..నేను ఎవరిలాగానో పాడలేను..నాలాగా మాత్రమే పాడతాను. అందరికీ భిన్నంగా స్టేజ్ మీద ఎలా అలరించాలో అలాగా చేస్తాను.’’ ఇదీ ఉషా స్టయిల్. (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేల మందికి ఉపాధి) ప్రతీ భారతీయ అమ్మాయికి చీర ఒక అబ్సెషన్. చిన్నతనంలోనే అమ్మ చీరను చుట్టకుని మురిసిపోయేంత ప్రేమ. ఈ నేపథ్యంలో ఖరీదైన వందల చీరలు ఉషా వార్డ్‌రోబ్‌లోకి కొలువు దీరాయి. అలాగే తన తల్లి అనుభవాలను కూడా ఆమె మీడియాతో పంచకున్నారు. మధ్యతరగతి మహిళ తన తల్లికి ఎక్కువ చీరలు కొనే స్థోమత లేకపోయిందని ఉషా ఉతుప్ గుర్తు చేసుకున్నారు. అలాగే తన తల్లి గడి, చుక్కలు, చారలు అంటే చాలా ఇష్టపడేవారి చెప్పారు. ముఖ్యంగా తన చీరల్లో పూజ బోర్డర్, బంగారు హంసలున్న మావ్-హూడ్ కాంజీవరం చీర చాలా ఖరీదైందని చెప్పారు. అంతేకాదు చాలా పాతదే అయినా ఈ ట్రెడిషనల్ చీరంటే తన కుమార్తెకు కూడా చాలా ఇష్టమనట. ఈ సందర్బంగా మరో విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) బ్లాక్ సారీ అంటే.. నలుపు రంగు చీర కట్టుకున్నప్పుడల్లా తన అత్తగారికి చాలా కోపం వచ్చేదని చెప్పారు. తమిళ అయ్యర్ కుటుంబం నుండి వచ్చిన తనకు బ్లాక్ సారీస్ అంటే చాలా ఇష్టంమని, సాధారణంగా ఇక్కడి మహిళలు నలుపు రంగును మహిళలందరూ ఇష్టపడతానన్నారు. అయితే కేరళకు చెందిన కుటుంబాన్ని వివాహం చేసుకున్నా.. అందుకే నల్ల చీర కట్టుకున్నప్పుడల్లా అత్తగారికి కోపం వచ్చేది అంటూ తన కెంతో ఇష్టమైన నల్లటి చీరను కూడా చూపించారు. ఉషా ఉతుప్ తొలి సంపాదన ఉషా ఉతుప్ తొలి సంపాదన నెలకు రూ. 750. తాను యాదృచ్ఛికంగా తన ఆంటీ సహాయంతో సింగింగ్‌లో వచ్చానన్నారు. అప్పుడపుడూ కొన్ని గిగ్‌లు పొందడానికి సహాయం చేసింది. అలా సింగింగ్ మీద ఆసక్తి పెరిగింది. ఒక హోటల్‌తో నైట్‌క్లబ్ గాయనిగా చేరారు. అక్కడ నెలకు రూ. 750 వచ్చేది అని చెప్పారు. నిజంగా ఆ సమయంలో డబ్బు సంపాదించడంలో థ్రిల్ వేరే అంటారు ఉష. -
'నాటునాటు' పాటకు ఈ వెర్షన్ చూశారా.. చూడండి అదిరిపోద్ది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- జూ. ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన RRR నుంచి ‘ఆస్కార్ అవార్డ్ సాధించిన ‘నాటునాటు’ పాట ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లోనూ అంతే సూపర్ హిట్ అయింది. ఈ పాటకు ఆస్కార్‌తో పాటు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది. ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. కానీ తాజాగా తన విభిన్నమైన స్వరంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించే ప్రముఖ గాయని ఉషా ఉతుప్ నాటునాటు పాటను ఆలపించారు. ఉషా ఉతుప్ వెర్షన్లో వచ్చిన ఈ పాటను మీరూ కూడా వినేయండి. (ఇదీ చదవండి:ఆమెతో సుధీర్ పెళ్లి ఫిక్స్.. గతంలో రష్మి చేసిన కామెంట్స్ వైరల్?) -
విశాఖ : సుశీల, ఉషా ఉతుప్‌లకు మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమన్ అవార్డు (ఫొటోలు)
-
‘ఒక అబ్బాయికి పాడిన ఏకైక గాయనిని నేనే’
పాప్ సింగర్‌గా.. విలక్షణ పాటలకు కేరాఫ్‌గా.. ఒక హీరోకి పాడిన ఏకైక గాయనిగా... నైట్క్లబ్సింగర్గా.. దమ్మారో దమ్ పాటతో నేపథ్య గాయనిగా... 51 సంవత్సరాలుగా పాటల ప్రపంచానికి సుపరిచితులు ఉషా ఉతుప్. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె తన గురించి చెప్పుకొచ్చారు.. ఉషా ఉతుప్.. ఈ పేరు వినగానే పెద్ద బొట్టు, పట్టు చీర, భారీ నగలు.. ఎప్పటినుంచి ఈ వేషధారణ ప్రారంభమైంది అని నన్ను అడుగుతారు. 1969లో ప్రారంభించాను. అప్పట్లో మంచి కంచి పట్టు చీరలు దొరికేవి కాదు. చాంద్ పొట్ట్ అని తమిళంలో అంటారు. అదే తిలకం సీసా. ఆ సీసాలో ఉండే చిన్న పుల్లలాంటి దానితో బొట్టు పెట్టుకునేదాన్ని. నేను పాటలు పాడటం మొదలుపెట్టే సమయానికి రంగుల రంగులలో సింగార్ కుంకుమ్ రావటం మొదలైంది. ఆ కుంకాన్ని చేతితో ముఖం మీద గుండ్రంగా పెట్టుకునేవారు. నేను కూడా అలా మొదలుపెట్టాను. అలా అలా రానురాను పరిమాణం పెరుగుతూ వచ్చింది. బొట్టుతోపాటు నేను కూడా పెద్దదాన్ని అవుతున్నాను. నేను ఎయిర్‌పోర్టుకి వెళ్లినప్పుడు, ఎప్పుడైనా ఉదయాన్నే ముఖాన బొట్టు కనిపించకపోతే, అక్కడి వారు ‘అమ్మా, బొట్టు ఏది, పెట్టుకోలేదేంటి’ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు. అందరికీ నా బొట్టు అంత అలవాటయిపోయింది. బొట్టు నా జీవితంలో భాగం అయిపోయింది. ఈ వేషధారణ నాకు నేనుగా రూపొందించుకున్నాను. నైట్ క్లబ్లో పాడుతోంది నేను నైట్ క్లబ్సింగర్గా నా కెరీర్ ప్రారంభించాను. ఆ తరవాత సినీపరిశ్రమలో నేపథ్య గాయనిగా మారాను. నైట్‌క్లబ్‌లో నా పాట విన్న లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్డి బర్మన్, శంకర్ జైకిషన్... ఇంకా చాలామంది... మద్రాసీ అమ్మాయి నైట్ క్లబ్లో పాడుతోంది అంటూ వినటానికి ఆసక్తి చూపేవారు. ఆ తరవాత వాళ్ల సినిమాలలో పాడటానికి అవకాశం ఇచ్చారు. నేను ఓబెరాయ్ హోటల్లో పాడినప్పుడు, బాలీవుడ్ నటుడు దేవానంద్ అక్కడ ఉన్నారు. పాట పూర్తికాగానే నన్ను పిలిపించి, ‘హరేరామ హరే కృష్ణ చిత్రంలో పాడతావా’ అని అడిగారు. అది 1969. షాన్ సినిమాకి పాడాను నేను ప్లేబాక్ సింగర్‌గా దమ్మారో దమ్ పాటతో కెరీర్ ప్రారంభమయ్యింది. దేవుళ్ల పేర్లు నన్ను చుట్టుముట్టేశాయి. హరి ఓం హరి, హరేరామ్ హరేకృష్ణ, రాధేశ్యామ్ రాధేశ్యామ్ పాటలు పాడాను. అందరూ నా పాట విని, కోమల గళంతో, చాలా బాగా పాడానని నన్ను ప్రశంసించారు. నా గొంతులాంటి గొంతు మాత్రం కాదు వారిది. నా కెరీర్ ప్రారంభమయ్యాక, ఎవరైనా హీరోయిన్లకు నా గొంతు సరిపోదనుకుంటే, టైటిల్స్ పడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లో పాడించేవారు. అలా షాన్ సినిమాకి పాడాను. ఒకసారి మిథున్చక్రవర్తికి పాడాను. ఒక అబ్బాయికి పాడిన ఏకైక గాయనిని నేనే. అంటూ చెప్పుకొచ్చారు. ఉషా ఉతుప్. -
నన్ను విచిత్రంగా చూశారు
ఉషా ఉతుప్... మాంచి జోష్ ఉన్న సింగర్. ఫీమేల్ సింగర్ అంటే వాయిస్ సున్నితంగా ఉండాలి అనుకునే ఆలోచనని తన బేస్ వాయిస్‌తో బద్దలుకొట్టారు. పేద్ద బొట్టు, తల నిండా పువ్వులు, చీర కట్టుతోనే మనందరికీ ఎప్పుడూ కనిపిస్తారు. కెరీర్ స్టార్టింగ్‌లో తన వేషధారణ వల్ల ఎదుర్కొన్న ఓ విచిత్ర అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో నైట్ క్లబ్లో పాటలు పాడేదాన్ని. నైట్ క్లబ్‌కి కూడా చీర కట్టుకొని వెళ్లేదాన్ని. అక్కడికి వచ్చిన వాళ్లంతా నన్ను స్టైజ్ మీద చూసి ‘ఈ అమ్మ ఏం పాడుతుందిలే..’ అన్నట్టుగా నన్ను విచిత్రంగా చూసేవారు. తీరా నేను పాడటం అయిపోయిన తర్వాత ‘వావ్’ అన్నట్టుగా ముఖాలు పెట్టేవారు. చాలా మంది అనుకుంటారు ఉషా ఉతుప్ అనగానే చీర, పెద్ద బొట్టుతో కనిపిస్తారు.. ఇది మార్కెటింగ్ స్ట్రాటెజీ అని. కానీ అలా ఏం కాదు. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అమ్మగారు ఎప్పుడూ చీరే కట్టుకునేవారు. నాకు తెలిసిన డ్రెస్ అదొక్కటే. అలాగే నేను చీర కట్టుకొని వెళ్లడం వల్ల నైట్‌క్లబ్‌కి ఫ్యామిలీలు కూడా రావడం స్టార్ట్ అయ్యారు. అలా నైట్ క్లబ్ ఫ్యామిలీ ప్లేస్‌లా మారిపోయింది. ఆడియన్స్‌లో చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అలాగే భార్యలందరికీ తమ భర్తల మీద ఓ భరోసా ఉండేది. నా శరీరాకృతి, నా అందం చూసి వాళ్ల భర్తల మనసు చలించదు అని (నవ్వుతూ)’’ అంటూ తన మీద తానే జోక్ వేసుకుంటూ, పాత అనుభవాలను పంచుకున్నారు ఉషా ఉతుప్. -
ఆమె ఒక ఆధ్యాత్మిక గీతం
సందర్భం ఉషా ఉతుప్ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. పాడడం ఈ సుప్రసిద్ధ గాయనికి కొత్త కాదు కానీ, తాజాగా పాడిన పాట, ఆ అనుభవం మాత్రం మునుపెన్నడూ ఇవ్వనంత ఆనందం ఆమెకు ఇచ్చాయి. మొన్న ఆదివారం వాటికన్ సిటీలో జరిగిన ఉత్సవంలో మదర్ థెరిసాను ‘పునీతురాలు’గా ప్రకటించే కార్యక్రమంలో పాల్గొని, పాట పాడిన ఉషా ఉతుప్ ఆ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోల్‌కతాకు చెందిన ఆమెకు పవిత్ర సేవామూర్తి మదర్ థెరెసాతో దాదాపు అయిదు దశాబ్దాల అనుబంధం. మాటల కోసం వెతుక్కుంటున్న వేళ ఉషా ఉతుప్ గొంతు పెగుల్చుకొని, ఆ మాతృమూర్తితో తన అనుబంధం గురించి చెప్పిన జ్ఞాపకాలు... ‘‘ఇప్పటికీ ఇదంతా నేను నమ్మలేకపోతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మదర్ థెరెసాతో నాది 47 ఏళ్ళ అనుబంధం. నేను తరచూ మాట్లాడిన వ్యక్తి, కలసి నడిచిన వ్యక్తి, కలసి పనిచేసిన మనిషి, అనుబంధమున్న వ్యక్తికి ఇవాళ ప్రపంచం మొత్తం ముందు ‘మహిమాన్వితురాలు’ హోదా (సెయింట్‌హుడ్) ప్రకటించడం ఆనందంగా ఉంది. అదీ కాకుండా, ఈ ఉత్సవంలో ‘పూరెస్ట్ ఆఫ్ ది పూర్’ అనే పాట పాడడం గాయనిగా నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. ఆ పాట కూడా నా రచనే! ఇలాంటి రోజు నాకు మళ్ళీ రాదేమో! తొలిసారి... హోమియో క్లినిక్‌లో..! మురికివాడల్లోని అభాగ్యులకు నిస్వార్థంగా సేవలందించిన ‘అమ్మ’ థెరెసాతో నేను గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే! మొట్టమొదటిసారి నేను ఆమెను కలసినప్పటికి ఆమె ఒక సాధారణమైన నన్. అప్పట్లో నేను ఒక హోమియోపతి క్లినిక్‌కి వెళ్ళేదాన్ని. క్రైస్తవ సన్యాసిని అయిన థెరెసా కూడా అక్కడికి తరచూ వస్తుండేవారు. అక్కడే మా తొలి పరిచయం జరిగింది. అలా జరిగిన మా పరిచయం ఏళ్ళు గడిచేకొద్దీ గాఢమైన స్నేహంగా మారింది. నేను ఆమె ప్రేమను పొందాను. ఆమెతో కలసి నడుస్తూ, నవ్వుతూ, తిరుగుతూ క్షణాలెన్నో! ఆ షరతు పెట్టారు! దాంతో కష్టమైంది! అప్పట్లో ఆమె నాకు కొన్ని నిర్ణీతమైన పనులు చెప్పేవారు. బీదవారి కోసం ఆహారం, దుస్తులు సేకరించడం నా ప్రధాన బాధ్యత. అయితే, మదర్ ఒక షరతు పెట్టారు. అది ఏమిటంటే, ‘మనం చేస్తున్నది ఏమిటో, ఎవరి కోసం చేస్తున్నామో ఎవరికీ చెప్పకూడదు. ఆర్భాటపు ప్రచారం చేయకూడదు.’ అమ్మ చెప్పినట్లే చేశాను. ఇలా చేయడం వల్ల వాలంటీర్లు చేస్తున్న పనిలోని అసలు సిసలు లక్ష్యం ఏమిటో అర్థం చేసుకుంటారు. మాకు తెలిసినవాళ్ళ దగ్గరి నుంచి, కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సామాన్లు సేకరించాం. ఇలా పాత దుస్తులు, మిగిలిపోయిన ఆహారం సేకరించడం నా గౌరవానికి భంగమని నేనెప్పుడూ అనుకోలేదు. ఆర్తుల కోసం ఇలాంటి పనులెన్నో చేసిన మదర్ ఎప్పుడూ వాటి గురించి గొప్పగా చెప్పుకొనేవారు కాదు. అది నాకు అబ్బురం అనిపించేది. ఒకసారి మాత్రం ‘అమ్మ’ చెప్పిన పని నాకు కష్టమైంది. పెళ్ళి విందుల్లో మిగిలిపోయిన ఆహారం సేకరించి, తెమ్మని చెప్పారు. అయితే, ఎప్పటిలానే - ఎందుకు, ఏమిటన్నది ఎవరికీ చెప్పకూడదు. కొద్దిగా కష్టమనిపించింది. కానీ, ‘బాహాటంగా ప్రకటించి చేసే సేవ ఎప్పటికీ సేవ కానే కాదు’ అని మదర్ అన్న మాటలు నా చెవుల్లో రింగుమన్నాయి. అంతే! ఆ పని చేసేశా! ఆ రెంటి ఖరీదూ ఎక్కువ! ఒక రోజున ఆమె కలకత్తాలోని నా స్టూడియోకు వస్తున్నారు. దోవలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అంతే! ఆమె ఉన్నట్టుండి కారు ఆపేసి, కిందకు దిగారు. ఆ మనిషి తాగి ఉన్నాడా, మరొకటా అని కూడా చూసుకోలేదు. ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆ ఘటన కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ విశ్వజనని ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు... ‘నాకు డబ్బులు అక్కర్లేదు. ఆర్తుల సేవ కోసం కృతనిశ్చయంతో నిలిచి, సమయం వెచ్చించేవారు కావాలి’. డబ్బులు ఎవరి దగ్గర నుంచైనా సంపాదించవచ్చు. కానీ, సేవా నిబద్ధత, సమయం వెచ్చించే సహృదయం - అంత సులభంగా దొరకవనీ, వాటి ఖరీదు చాలా ఎక్కువనీ ఆమెకు తెలుసు. నా దగ్గర నుంచి ఆమె కోరుకున్నవి కూడా - ఆ నిబద్ధత, సమయమే! అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం అంటే, గతంలో పండిట్ రవిశంకర్, జాకీర్ హుస్సేన్, అమ్జద్ అలీ ఖాన్ లాంటి ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత కళాకారులు పాల్గొన్నారు. సాధారణంగా మన సంస్కృతీ వారసత్వం అంటే భరతనాట్యం, కథకళి లాంటివే గుర్తుకొస్తాయి. కానీ, మన సంస్కృతి అక్కడికే పరిమితం కాదనీ, విశ్వజనీనమైన ప్రేమకు ప్రతిరూపమనీ, ప్రియతమ మదర్‌కు నివాళి ఇచ్చే నా పాట, ఆర్కెస్ట్రా ద్వారా చెప్పేందుకు ప్రయత్నించాను. నిజానికి, భౌతికంగా మన ముందున్న రోజుల్లోనే మదర్ థెరెసా పరమ పావని, మహాత్మురాలు. మూర్తీభవించిన ఆ మానవతా మూర్తికి ఇప్పుడు ఇలా ‘మహిమాన్వితురాలు’ అనే అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం కేవలం ఒక లాంఛనం. పవిత్ర చరిత్ర కలిగిన ఆ అమ్మతో నా అనుబంధం నా జీవితాంతం మరపురానిది. ఒక్క మాటలో చెప్పాలంటే, గడచిన శతాబ్దంలో ఆమె లాంటి అత్యంత గొప్ప మనిషినీ, కొన్ని కోట్ల మందిని స్పృశించి, వారి జీవితాలపై ముద్ర వేసిన వ్యక్తినీ మరొకరిని నేను చూడలేదు. ఆమెను చూసినవారెవరైనా సరే నా మాటలతో ఏకీభవిస్తారు. కోల్‌కతాలో మా ఇంటి నుంచి బయట కాలు పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆ మాతృమూర్తి నడిచిన దారిలోనే నేనూ నడుస్తున్నాను, ఆమె పీల్చిన గాలే పీలుస్తున్నాను అని గుర్తుకొస్తుంది. అంతే! ఈ జీవితానికి అంతకు మించిన సంతృప్తి ఇంకేం కావాలి!’’ చిరిగిన స్వెట్టర్ చెప్పిన సంగతి! నన్ను కదిలించిన మరో సంఘటన చెప్పి తీరాలి. చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ‘మదర్’ను కలిశా. ఆమె వేసుకున్న స్వెట్టర్ చిరిగిపోయి, రకరకాల మాసికలు వేసి ఉండడం గమనించాను. నాకెంతో బాధ అనిపించింది. ఆగలేకపోయా. ‘మదర్! కొత్త స్వెట్టర్ వేసుకోవచ్చుగా?’ అని అడిగేశా. దానికి, ఆమె ఇచ్చిన జవాబు ఒకటే - ‘ఉషా! ప్రపంచంలోని బీదలలో కెల్లా కడు బీదవారితో కలసి నేను జీవిస్తున్నా. కొత్తవి వేసుకొని తిరుగుతూ, బీదవారి కోసం జీవితం గడుపుతున్నా అని చెప్పుకుంటే ఎలా?’ అన్నారు. అంతే! నా నోట మాట లేదు. అందరికీ చెప్పడమే కాదు... చెప్పిందే ఆచరణలోనూ చేసే మనిషి మదర్ థెరెసా అని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. -
ఉషా ఉతుప్ రాయని డైరీ
మనుషులు కదలరు. కదలాలనే ఉంటుంది. కదిలితే బాగుండనే ఉంటుంది. కానీ కదల్లేరు. ఏదైనా ఫోర్స్ వారిని కదిలించాలి. ఏ శక్తీ కదిలించకపోతే అలాగే ఆడియన్స్‌గా ఉండిపోతారు. ఎప్పటికీ! అది వాళ్లకు సంతోషం కావచ్చు. కానీ వేదికపై ఇంకో సంతోషం ఉంది. కొంచెం పై లెవల్లో. దాన్ని ఎక్కితే ఆ ఆనందం ఇంకోలా ఉంటుంది. అయితే ఎలా? వేదిక వాళ్లది కాదు కదా. వాళ్ల కోసం కోల్‌కతా నుంచో, ముంబై నుంచో, చెన్నై నుంచో వచ్చిన వాళ్లది! కానీ మ్యూజిక్.. ఆడియన్స్ కోసం వేదికపై నుంచి చేతులు చాస్తుంది.. వచ్చి వాలిపొమ్మని. ప్రేమా అంతే. తల నిమురుతూ ఒడిలోకి తీసుకుంటుంది. దటీజ్ వై.. ఐ బిలీవ్ ఇన్ మ్యూజిక్. ఐ బిలీవ్ ఇన్ లవ్. రెండూ రెండు వేర్వేరు డ్రైవింగ్ ఫోర్స్‌లు. రెండూ కలిసి సుడిగాలై వీస్తే మనిషిని పైకి లేపేస్తాయి.. గాన గాంధర్వంలోకి, ప్రేమ మాధుర్యంలోకి. సుడిగాలి వీయడం ఏమిటి! రేగుతుందేమో కదా. లేదంటే, లేస్తుంది.. సుడులు తిరుగుతూ పైపైకి. కానీ లోపల ఉన్నదేమిటి? సంగీతం కదా, ప్రేమ కదా.. అందుకే అదొక దివ్య సమ్మేళనమై మత్తుగా వీస్తుంది. డాఆఆఆఆఆఆ... ర్లింగ్... ఆంఖో సే ఆంఖో చార్ కర్నేదో... ఎవరూ కదల్లేదు! దమ్ మారో దమ్... మిత్ జాయే గమ్... ఎవరూ కదల్లేదు! ఈ హైదరాబాద్‌కి ఏమయింది! నో గ్రూవింగ్. పైకి రమ్మని అడుగుతున్నాను. ఆడియన్స్లోంచి ఒక అమ్మాయి లేచింది. సిగ్గు పడుతూ నిలుచుంది. ఆ అమ్మాయిని రమ్మన్నాను. నాతో కలిసి ‘మోనీకా... ఓ మై డార్లింగ్’ అంటూ పాడాలి. నాతో పాటు హిప్స్ కదపాలి. కనీసం లిప్స్. అమ్మాయి డయాస్ పైకి వచ్చేసింది! వావ్.. దట్ ఈజ్ లౌలీ. వాళ్లాయన కింది నుంచి చూస్తున్నాడు. తినేస్తాననా? సిగ్గు తీసేస్తాననా? అమ్మాయి చెయ్యి అందుకున్నాను. కింద ఉన్న అబ్బాయి వైపు చూస్తూ అన్నాను... ‘నౌ విత్ యువర్ పర్మిషన్, ద హోల్ వరల్డ్ విల్ కాల్ యువర్ వైఫ్.. ఓ మై డార్లింగ్’. అప్పుడొచ్చింది ఆడియన్స్‌లో కదలిక! ‘మోనీకా..’ అంటూ ఊగిపోతున్నారు. హా హ్హా హా.. సంగీతమూ, ప్రేమే కాదు, ఏ బ్యూటిఫుల్ ఉమన్ బీ ఏ క్రూన్డ్ ట్రాక్ ఆఫ్ డ్రైవింగ్ ఫోర్స్. వినడం మాని, పాడే స్టేజ్‌లోకి వచ్చింది కాన్సర్ట్. అంతా గొంతు కలుపుతున్నారు. మొత్తంగా కదలడం వీలుకాని వాళ్లు కనీసం చేతులనైనా కదిపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కదులుతున్నారు. పాటలో అమృతం ఉంటుంది. అది తాగాలి. పాడడంలోనూ అమృతం ఉంటుంది. దాన్ని తాగమని ఇవ్వాలి? మనుషులు ఎక్కువసేపు దూరంగా ఉండిపోలేరు. పాటగానీ ప్రేమగానీ దొరికే వరకే ఆ దూరం. - మాధవ్ శింగరాజు -
అవార్డులంటే ఇష్టమే..
తన పాటలకు ప్రేక్షకులు ఉర్రూతలూగినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదని, అయితే, తనకు అవార్డులు కూడా ఇష్టమేనని విలక్షణ గాయని ఉషా ఉతుప్ చెబుతోంది. అవార్డులు ప్రతిభకు గుర్తింపు అని, కళాకారులెవరైనా వాటిని ఇష్టపడతారని, చాలామంది ఆ సంగతిని బయటకు చెప్పేందుకు మొహమాటపడతారని అంటోంది. అయితే, పాటల్లోని సాహిత్యంపై మాట్లాడేంత శక్తి తనకు లేదని వ్యాఖ్యానిస్తోంది. -
'రివాల్వర్ రాణి'కి ఉషా ఉత్తుప్ పాట
విభిన్నమైన స్వరం.. నుదుట రూపాయి కాసంత బొట్టు, ఎప్పుడూ నవ్వుతూ గలగల మాట్లాడే ఉషా ఉత్తుప్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ సహా 24 భాషల్లో అలవోకగా లెక్కలేనన్ని పాటలు పాడిన ఆమె ఇప్పటికీ తన గొంతుకు విశ్రాంతి ఇవ్వట్లేదు. కంగనా రనౌత్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న 'రివాల్వర్ రాణి' చిత్రానికి టైటిల్ సాంగ్ పాడారు. కంగనా రనౌత్‌కు ఉషా ఉత్తుప్ తన గొంతు ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి టైటిల్ సాంగ్ ఉషాజీయే పాడారని, మంచి హస్కీ వాయిస్ కావాలనుకున్న తమకు ఉషా ఉత్తుప్ కంటే మంచి గాయని ఎవరూ దొరకలేదని ఈ సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం క్వీన్ చిత్రం విజయవంతం కావడంతో మంచి ఊపుమీదున్న కంగనా.. రివాల్వర్ రాణితో మరింత దూసుకెళ్లాలని అనుకుంటోంది. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది.