ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గాయని భర్త జానీ చాకో (78) గుండెపోటుతో సోమవారం కన్నుమూశారు. ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో జానీకి ఛాతీలో నొప్పి మొదలైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. గుండెపోటు వల్లే మరణించినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా ఉషాకు ఈయన రెండో భర్త. వీరికి సన్నీ అనే కుమారుడు, అంజలి అనే కూతురు ఉన్నారు. ఉషా ఉతుప్ విషయానికి వస్తే.. ఈమె తన విభిన్నమైన స్వరంతో సంగీతప్రియులను ఉర్రూతలూగించింది. క్లాసికల్ అయినా, వెస్ట్రన్ అయినా అలవోకగా పాడేది. మొదట్లో నైట్ క్లబ్ సింగర్‌గా ఉన్న ఆమె తర్వాత సినిమాల్లోకి వచ్చింది.
కీచురాళ్లు టైటిల్ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు ఆలపించింది. సంగీత ప్రపంచంలో తన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2011లో పద్మశ్రీతో సత్కరించగా ఈ ఏడాది పద్మ భూషణ్ అందించింది.
Comments
Please login to add a commentAdd a comment