వంద శాతం రుణ వసూళ్లే లక్ష్యం
2016–17 రుణ వసూళ్ల కార్యాచరణ ప్రణాళిక త్వరగా సిద్ధం చేసి నూరు శాతం వసూళ్ల లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య తెలిపారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్
ముమ్మనేని వెంకటసుబ్బయ్య
పాత గుంటూరు: 2016–17 రుణ వసూళ్ల కార్యాచరణ ప్రణాళిక త్వరగా సిద్ధం చేసి నూరు శాతం వసూళ్ల లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిపాలనా కార్యాలయంలో శుక్రవారం బ్యాంకు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాంచీలు, సంఘాల ద్వారా రైతులకు ఇవ్వాల్సిన ఖరీఫ్ రుణాలను సత్వరం మంజూరు చేయాలని సూచించారు. సెప్టెంబరు 30 నాటికి సాధించాల్సిన నిర్దేశిత లక్ష్యాలను సిబ్బంది అధిగమించాలని ఆదేశించారు. జిల్లాలోని రైతాంగానికి దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అరటి మొక్కల పెంపకానికి ఎకరానికి రూ.80 వేలు రుణం మంజూరు చేయాలన్నారు. పలు అంశాలపై సమీక్షించేందుకు ఈ నెల 19న గుంటూరు, తెనాలిలో, 20న గురజాల, నరసరావుపేటలో సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.