
Amitabh Bachchan Jhund Movie First Day Collection Is 1 Crore Above: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తాజా చిత్రం 'జుండ్’'. ఇందులో బిగ్‌బి ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టీ సిరీస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదలైంది. సానుకూల స్పందనతో థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. మంచి టాక్‌తో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే రూ. 1.5 కోట్లు రాబట్టింది.
నాగ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ విజయ్ బార్సే జీవితం ఆధారంగా జుండ్ సినిమా తెరకెక్కింది. విజయ్ బార్సే పాత్రలోకి అమితాబ్ పరకాయ ప్రవేశం చేశాడు. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారని తెలుస్తోంది. అందుకు తన పారితోషికాన్ని తగ్గించమని మేకర్స్‌కు అమితాబ్ చెప్పిన విషయాన్ని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment