వసూళ్ల ఫీవర్‌....? | tax collection in panchayat | Sakshi
Sakshi News home page

వసూళ్ల ఫీవర్‌....?

Published Mon, Oct 17 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

వసూళ్ల  ఫీవర్‌....?

వసూళ్ల ఫీవర్‌....?

–పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు ఉరుకులు...పరుగులు
–కలెక్టర్‌ హెచ్చరికలతో అధికారుల్లో గుబులు
–జిల్లా వ్యాప్తంగా రూ.77.84కోట్లు మేరకు బకాయిలు
 
కొవ్వూరు:
వారం రోజుల్లో తొభైశాతం కంటే తక్కువగా పన్నులు వసూలు చేస్తే  చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్‌  హెచ్చరికలు ఈవోపీఆర్‌ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శుల్లో గుబులు రేపుతున్నాయి.లక్ష్యాల సాధన కోసం పల్లెల్లో ఉరుకులు పరుగులు తీస్తున్నారు.2015–16 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాలో పంచాయతీలకు ఇంటి, కుళాయి పన్నులు కలిపి రూ.6.46 కోట్లు వసూలు కావాల్సి ఉంది.దీనిలో ఇళ్ల పన్నుల వసూళ్లు సరాసరి 93శాతం రాగా, కుళాయి పన్నులు మాత్రం 86  శాతమే వసూలు అయ్యాయి.దీంతో గత ఏడాది రావాల్సిన పన్నులను వారం రోజుల్లో తొభైశాతం పైబడి వసూలు చేయని వారిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్‌ శుక్రవారం ఏలూరులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెచ్చరించారు.జిల్లాలో 23 మండలాల్లో తొభైశాతం లోపు పన్నులు వసూలు చేసిన మండలాలున్నాయి.కలెక్టర్‌ హెచ్చరికల నేపధ్యంలో ఆయా మండలా లకు చెందిన ఈవోపీఆర్‌ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో మైక్‌ ప్రచారాలతో పన్నుల వసూళ్లకు చర్యలు చేపట్టారు.కిందిస్ధాయి సిబ్బందికి పన్నుల వసూళ్లపై దిశనిరే్ధశం చేశారు.అయితే నిరే్ధశించిన మేరకు వీరిలో లక్ష్యాలను చేరుకునేది ఎంతమంది అనేది వేచిచూడాల్సిందే.ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే ఆరునెలలు పూర్తయ్యింది. పంచాయతీలకు ఇంటి,కుళాయి పన్నుల రూపేణా బకాయిలతో కలిపి రూ.77.84 బకాయిలు వసూలు కావాల్సి ఉంది.ఈ పన్నుల్లో కేవలం ఇంటి పన్నులు ఆరుశాతం, కుళాయి పన్నులు తొమ్మిది శాతం మాత్రమే వసూలయ్యాయి.ముఖ్యంగా పంచాయతీల్లో ఇళ్ల పన్నులు రివిజన్‌ చేయడం మూలంగా పన్నులు భారీగా పెరిగాయి.దీంతో లక్ష్యాల సాధనలో  అధికారులు అపసోపాలు పడుతున్నారు.ఈ వారంలో నిరే్ధశించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలు కాకపోతే ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం అధికారులను వెంటాడుతుంది.
23 మండలాల్లో తక్కువగా వసూలైన పన్నులు: 
                   జిల్లా కేంద్రమైన ఏలూరు మండలంలో ఇంటి పన్నులు ఎనభై ఐదుశాతం వసూలైతే, కుళాయి పన్నులు 82శాతమే వసూలు చేశారు.వేలేరుపాడు మండలంలో ఇంటిపన్నులు నూరుశాతం వసూలు చేసినప్పటికీ కుళాయి పన్ను మాత్రం కేవలం మూడు శాతం వసూలు చేసి జిల్లాలో చివరిస్ధానంలో నిలిచింది.కుళాయి పన్నులు వసూళ్లలలో జిల్లాలో కుక్కునూరు,లింగపాలెం మండలాల్లో 42 శాతంతో వెనుకబడి ఉన్నాయి. మొగల్తూరులో 43 శాతం, పోలవరం 52 శాతం, వీరవాసరం లో 58 వసూళ్లలతో తర్వత స్ధానాల్లో ఉన్నాయి. పెదవేగి,చింతలపూడి, పెరవలి మండలాల్లో 70 శాతం లోపు కుళాయి పన్నులు వసూలు చేసిన జాబితాలో ఉన్నాయి. టి.నరసాపురం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి, దెందులూరు, గణపవరం, పెదవేగి, పెంటపాడు, ఉంగుటూరు, చాగల్లు, దేవరపల్లి, మండలాల్లోను,ఆచంట, ఆకివీడు, కాళ్ల మండలాల్లో కుళాయి పన్నులు తొభైశాతం లోపు మాత్రమే వసూలు అయ్యాయి.ఇళ్ల పన్ను వసూలులో చాగల్లులో 71శాతంతో చివరిస్ధానంలో ఉండగా పోలవరం 76శాతం,వీరవాసరం 77, లింగపాలెంలో 79 శాతం,ఏలూరులో 85,ఉండ్రాజవరం, దేవరపల్లి మండలాల్లో 89 శాతం వసూళ్లలతో తర్వత స్ధానాల్లో ఉన్నాయి. ఇప్పుడు లక్ష్య సా««దlన కోసం ఈ మండలాల్లో అధికారులు నానా ప్రయాసలు పడుతున్నారు.
అక్రమ కుళాయిలపై నో యాక్షన్‌:
జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో అక్రమ కుళాయి కనెక్షన్‌ లున్నాయి.రాజకీయ ఓత్తిళ్లు, ఇతర కారణాలతో వీటిని నియంత్రించ కపోవడంతో పంచాయతీలకు రావాల్సిన లక్షలాది రుపాయిల సోమ్ములు పక్కదారి పడుతుంది. అక్రమ కుళాయి కనెక్షన్‌లపై దష్టి సారిస్తే పంచాయతీలకు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదిశగా దష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement