పన్నుల పెంపుపై లాలాచెరువుకు రాయితీ? | tax relxation lalacheruvu panchayat | Sakshi
Sakshi News home page

పన్నుల పెంపుపై లాలాచెరువుకు రాయితీ?

Published Wed, Apr 19 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

పన్నుల పెంపుపై లాలాచెరువుకు రాయితీ?

పన్నుల పెంపుపై లాలాచెరువుకు రాయితీ?

50 శాతమే వసూలు చేయాలన్న కోర్టు!   
తుది తీర్పును అనుసరించి తదుపరి చర్యలు 
రాజానగరం : ఇంటి పన్నులను భారీగా పెంచుతూ పంచాయతీ అధికారులు తీసుకున్న నిర్ణయం నుంచి రాజానగరం మండలం, లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీ వాసులకు కాస్త ఊరట లభించినట్టే. పెంచిన పన్నుల విధానాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది గ్రామస్తులు మాజీ సర్పంచ్‌ మెట్ల ఏసుపాదం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వారి పిటిష¯ŒSను స్వీకరించిన హైకోర్టు పెంచిన పన్నుల్లో ప్రస్తుతం 50 శాతమే కట్టించుకోవాలని ప్రాథమికంగా సూచించినట్టు కోర్టును ఆశ్రయించిన వారు చెబుతున్నారు. దీంతో కోర్టు నిర్ణయంపై లాలాచెరువు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
భూమి విలువ బట్టి పెంపు
ఇంటి పన్నుల పెంపు విధానం జిల్లా అంతటా ఒక విధంగా ఉంటే లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీలో మాత్రం ప్రత్యేకంగా అమలు చేశారు. పంచాయతీల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఆలోచనలో భాగంగా పెరిగిన ఇంటి పన్నుల విధానంలో సబ్‌రిజిస్ట్రార్‌లు ఇచ్చిన భూమి విలువను బట్టి ఇంటి పన్నులను పెంచారు. భూమి విలువపై రూ.వెయ్యికి 13 పైసలు చొప్పున ఇంటి పన్ను లెక్కించి డిమాండ్‌ నోటీసులు అందజేశారు. 
లాలాచెరువుకు ప్రత్యేక వడ్డింపు
లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీలో మాత్రం 20 పైసలు చొప్పున లెక్కించి ఇంటి పన్నును నిర్ణయించడంతో సాధారణ ఇంటికి కూడా వేల రూపాయల్లో ఇంటి పన్ను వచ్చింది. మొన్నటి వరకు రాజమహేంద్రవరం మున్నిపల్‌ కార్పొరేష¯ŒSలో విలీన గ్రామాలుగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల్లోని 21 పంచాయతీలపై ప్రత్యేకాధికారిగా ఉన్న నగర పాలక సంస్థ  కమిషనర్‌ ఆదేశాల మేరకు లాలాచెరువులో భూమి గజం విలువపై రూ.వెయ్యికి 20 పైసలుగా లెక్కించినట్టు సంబంధిత అధికారి తెలిపారు. ఈ పెంపు విషయంమై స్థానిక ప్రజానీకం ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయినా అధికారుల్లో చలనం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
లాలాచెరువుపైనే ఎందుకో..
జిల్లాలో ఏ పంచా యతీ విషయంలో లేనివిధంగా లాలాచెరువు పంచాయతీపై అధికారులు ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారో జనానికి అర్థం కావట్లేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఇవతల వైపు ఉన్న లాలాచెరువులో గజం రూ.5000, అవతల ఉన్న దివా¯ŒSచెరువు పంచాయతీ పరిధిలోని ఇండస్ట్రీస్‌ ఏరియాగా ఉన్న రూపానగర్, స్వరూపానగర్‌లలో రూ.3000లుగా సబ్‌రిజిస్ట్రార్‌ భూమి విలువను నిర్ణయించారు. జిల్లా అంతటా గజం విలువపై వెయ్యికి 13 పైసలు చొప్పున ఇంటి పన్ను వేస్తే లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీలో 20 పైసలు వేశారు. స్థిరమైన మార్గదర్శకాలు లేకుండా ఏవిధంగా ఈ వివక్షను చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. అలాగే మా కాలనీలో అన్ని ఇళ్లకు ట్యాప్‌లు ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి వాటర్‌ టాక్స్‌ ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. అయినా ఇంటి పన్నులో మరోసారి వాటర్‌ టాక్స్‌ వేశారు.  
– మెట్ల ఏసుపాదం, మాజీ సర్పంచ్, లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement