ఆగస్టులో రూ.1.75 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు మరో సారి బలంగా నమోదయ్యాయి. ఆగస్ట్‌లో రూ.1.75 లక్షల కోట్లు జీఎస్‌టీ రూపంలో సమకూరింది. 2023 ఆగస్టు నెలలో రూ.1.59 లక్షల కోట్ల ఆదాయంతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగింది. ఇక ఈ ఏడాది జూలై నెలకు జీఎస్‌టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో పోల్చితే ఆగస్ట్‌లో స్వల్పంగా తగ్గాయి. 2024 ఆగస్టులో దేశీ లావాదేవీలపై జీఎస్‌టీ ఆదాయం 9.2 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లుగా నమోదైంది.
దిగుమతి చేసుకున్న వస్తువులపై స్థూల జీఎస్‌టీ ఆదాయం 12.1 శాతం పెరిగి రూ.49,976 కోట్లకు చేరింది. ఇక ఆగస్టులో రూ.24,460 కోట్ల జీఎస్‌టీ రిఫండ్‌లు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలో పోల్చితే 38 శాతం పెరిగాయి. రిఫండ్‌లను సర్దుబాటు చేసి చూస్తే, నికర జీఎస్‌టీ ఆదాయం 6.5 శాతం పెరిగి రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. పండుగలకు ముందు జీఎస్‌టీ వసూళ్లు 10 శాతం పెరగడం వినియోగం బలంగా ఉన్నట్టు సూచిస్తోందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ఎంఎస్ మణి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment